Guntur BRS offce :   భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయాన్ని గుంటూరులోనే ఏర్పాటు  చేయాలని నిర్ణయించారు. సాదాసీదా ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఆదివారం రోజు ఉదయం ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖరే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనునన్నారు. ఎలాంటి బహిరంగసభను ఏర్పాటు చేయడం లేదు. తెలంగాణ నుంచి కీలక నేతలెవరూ హాజరు కావడం లేదు. ఈ కార్య‌క్ర‌మానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజ‌రుకావాల‌న్నారు. కలిసి కట్టుగా వచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా తోట చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.                     


గుడివాడ బస్టాండ్‌ దగ్గరే తేల్చుకుందాం - కొడాలి నానికి విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ ! అసలేం జరిగిందంటే ?                          


గత జనవరిలో బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ రావు ను కేసీఆర్ నియమించారు. జనవరిలో  2న తోట చంద్రశేఖర్  తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో  బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను  కేసీఆర్ ప్రకటించారు. మాజీ మంత్రి  రావెల కిషోర్ బాబు, బీజేపీ నేత చింతల పార్థసారధి కూడా అప్పట్లోనే పార్టీలో చేరారు.  ఏపీలోనూ బీఆర్ఎస్ కు మంచి స్పందన లభిస్తుందని సంక్రాంతి తర్వాత ఏపీ బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభిస్తామని చెప్పారు. అయితే బాగా ఆలస్యంగా ప్రారంభిస్తున్నారు.                                        


వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐకి స్టేట్‌మెంట్ ఇచ్చాను - ఆ వివరాలు బయటకు ఎలా వచ్చాయన్న అజేయకల్లాం !


పెద్ద ఎత్తున ఏపీ నుంచి చేరికలు ఉంటాయని అనుకున్నప్పటికీ పెద్దగా ఎవరూ పార్టీలో చేరకపోవడంతో బీఆర్ఎస్ వర్గాల్లో జోష్ లేకుండా పోయింది. ఇటీవల స్టీల్ ప్లాంట్ అంశంలో తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ దాఖలుచేయాలని నిర్ణయించడంతో ఆ పార్టీ నేతలు హుషారుగా రాజకీయం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గామని కేంద్ర మంత్రి ప్రకటించడంతో ఇక విజయోత్సవ సభ నిర్వహించాలని అనుకున్నారు. కానీ కేంద్రం ప్రైవేటీకరణకే కట్టుబడి ఉన్నామని చెప్పడంతో బీఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.                            


నిజానికి విశాఖలో రాష్ట్ర కార్యాలయం పెడతారని.. భారీ బహిరంగసభ కూడా పెడతారని కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. త్వరలో అంటూ టైం గడిచిపోయింది కానీ చివరికి గుంటూరులోని ఆటోనగర్‌లో ఓ భవనంలో కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. కేసీఆర్ వస్తే ఓ ఊపు వచ్చి ఉండేదని కానీ ఆయన టూర్ షెడ్యూల్ లేకపోవడంతో.. బీఆర్ఎస్ కార్యకర్తలు నిరాశ చెందుతున్నారు. బహిరంగసభ ద్వారా సత్తా  చూపిస్తే వచ్చే ఎన్నకిలకు మంచి ఉత్సాహం ఉండేదంటున్నారు.