AP BJP Leaders:  ఏపీ బీజేపీలో అసమ్మతి స్వరం వినిపిస్తున్న వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ధమమయినట్లుగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఏపీ బీజేపీ నాయకత్వంపై తిరుగుబాటు ఎక్కువైంది. సోము వీర్రాడుపై డిల్లీకి వెళ్లి మరీ ఫిర్యాదు  చేశారు. తర్వాత బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్ ఏపీ పర్యటనకు వచ్చారు. ఇప్పుడు ఇలాంటి సమస్యలన్నీ అధిగమించి.. దూకుడుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.  ఇప్పటికే పార్టికి చెందిన నాయకులు పలువురు పార్టి నాయకత్వాన్ని ధిక్కరించి మాట్లాడటంతో వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర పార్టీకి సిఫారసు చేసే అవకాశం కనిపిస్తోంది. 


ఢిల్లీ వెళ్లి మరీ సోము వీర్రాజు పై ఫిర్యాదు చేయడంతో కలకలం !


భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణకు   ప్రాదాన్యత ఉంటుంది   పార్టీ లైన్ దాటి ఇష్టాను సారంగా వ్యవహరిస్తే వేటు వేస్తారు.  ఇటీవల కన్నా లక్ష్మినారాయణ ఎపిసోడ్ లో మాత్రం ఈ వ్యవహరం కాస్త నెమ్మదించిందనే ప్రచారం ఉంది. కన్నా లక్ష్మినారాయణ వంటి సీనియర్ నేత పార్టీ రాష్ట్ర నాయకత్వం పై ప్రెస్ మీట్ పెట్టి మరి విమర్శలు చేశారు. కోర్ కమిటిలో సమాచారం ఇవ్వకుండా అద్యక్షుడిగా ఉన్న సొము వీర్రాజు ఇష్టాను సారసంగా పార్టి వ్యవహరాలను నడిపిస్తున్నారని ,తాను నియమించిన వారిని సొము వీర్రాజు ఎకపక్షంగా తొలగించారిని, అది కూడ ముదస్తు సమాచారం ఇవ్వకుండా చర్యలు తీసుకోవటం పై కన్నా లక్ష్మినారాయణ మండిపడ్డారు. అదే సమయంలో తొలగించిన నేతలు కూడ పార్టీ నుండి వైదొలుగుతూ,రాజీనామా చేశారు.


కన్నా ధిక్కరించినా ఏ చర్యా తీసుకోని హైకమాండ్ ! 


ఈ ఎపిసోడ్ పార్టిలో తీవ్ర కలకం రేపింది.అదే సమయంలో కన్నా లక్ష్మినారాయణ కూడ పార్టీ నేతలతో, తన వర్గంతో సమావేశం ఏర్పాటు చేసుకోవటం,బీజేపికి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టి తీర్దం పుచ్చుకోటం కూడ జరిగిపోయింది. నా ఈ వ్యవహరం పై ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీలోని నేతలు ఎవ్వరూ స్పందించలేదు.కన్నా పై కనీసం క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోలేదు. నోటీసులు కూడా ఇవ్వలేదు.అయితే కన్నా పార్టీ నుండి బయటకు వెళటానికి ఫిక్స్ అయిపోయారు కాబట్టి అలాంటి వ్యాఖ్యలు చేశారు.. అలాంటప్పుడు పార్టి నుండి సస్పెండ్ చేశామనే ముద్ర మాత్రం భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఉండాలనే వాదన  కి కొందరు నేతలు వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.
ఢిల్లీ బాట పట్టిన అసంతృప్తి నేతలు...


ధిక్కరించిన వారిపై రేపోమాపో చర్లు ! 


కన్నా  రాజీనామా చేసిన తర్వాత ఏపీ బీజేపీ సీనియర్లు కొందరు  అగ్ర నాయకులను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే వారికి అపాయింట్ మెంట్ లభించలేదని చెబుతున్నారు. విభేదాలు ఉన్నా,సమస్యలు ఉన్నా రాష్ట్ర నాయకత్వం వద్ద కాని లేదా, క్రమశిక్షణా సంఘం వద్ద కాని తేల్చుకోవాలని సూచించినట్లుగా చెబుతున్నారు.ఈ వ్యవహరం పై ఆంద్రప్రదేశ్ బీజేపి రాష్ట్ర కమిటి కూడ సీరియర్ అయ్యింది.  కనీసం తమ కు సమస్యలను గురించి వివరిచకుండా, అగ్రనాయకత్వం వద్దకు పంచాయితీకి వెళ్లటం పై అసంతృప్తి గా ఉన్నారని అంటున్నారు.అందులో భాగంగానే క్రమిశిక్షణా కమిటి నుండి ఈ వ్యవహరాన్ని చర్చించి త్వరలోనే చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారని పార్టి నేతలు అంటున్నారు.   ఇష్టాను సారంగా మాట్లాడటం,అభ్యంతరకరమయిన పరిస్దితులు తీసుకురావటం వంటి ఘటనలు ఉత్పన్నం అవుతున్నందున  సీరియస్‌గాఉండాలని రాష్ట్ర నాయకత్వం అనుకుంటోంది.