Prajaporu  BJP :  ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏడు వేలకుపైగా నిర్వహించిన ప్రజా పోరు సభల ద్వారా ఏపీ ప్రభుత్వ అవినీతి, అరాచక పాలన గురించి ప్రజల్లోకి తీసుకెళ్లామని ఏపీ బీజేపీ ప్రకటించింది.  భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో నిర్వహించిన ప్రజాపోరు సభలతో రాష్ట్ర ప్రభుత్వానికి వణుకు ప్రారంభమైందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి  విష్ణువర్ధన్‌రెడ్డి ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ రెండు వారాలుగా రాష్ట్రంలో ప్రజాపోరు వీధి సభలు నిర్వహించింది.  ఈ ప్రజాపోరు సభలు ఆదివారంతో పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రజాపోరు సభల ఇన్‌ఛార్జి విష్ణువర్ధన్‌రెడ్డి మద్దతిచ్చిన ప్రజలకు  ధన్యవాదాలు తెలిపారు.


ప్రభుత్వ వైఫల్యాలను ఏడువేల సభల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన ఏపీ బీజేపీ 


 ప్రజాపోరు సభల ద్వారా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం 3 ఏళ్లుగా రాష్ట్రంలో చేస్తున్న అవినీతి, అరాచక, అసమర్ధ, ప్రజావ్యతిరేక పాలనను భాజపా  క్షేత్రస్ధాయిలో నిలదీసిందన్నారు. కుటుంబ, కుల రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా భాజపా పోరు సల్పిందన్నారు. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ప్రజాపోరు సభల్లో మొత్తం 7 వేల సభలు జరిగాయని అన్నారు. ఈ సభలకు ప్రజల నుంచి భారీ ఆదరణ లభించిందని చెప్పారు. నిరుద్యోగులు సభలకు విశేషంగా తరలివచ్చి తమ గోడును భాజపా నాయకుల ముందు వెళ్లబోసుకున్నారన్నారు. ఈ ప్రజాపోరు సభల ద్వారా వివిధ వర్గాలకు చెందిన అన్యాయం, సమస్యలను భాజపా గుర్తించడం జరిగిందన్నారు. 


అన్ని వర్గాల ప్రజలనూ మోసం  చేసిన ప్రభుత్వం 


రైతాంగానికి గిట్టుబాటుధర కల్పించకపోవడంతో పాటు, పంటలబీమా సకాలంలో చేయకపోవడంతో రైతులు ఆర్ధికంగా నష్టపోయారు. పేదలకు 25 లక్షల ఇళ్లిస్తే వాటిని కట్టే సామర్ధ్యం ఈ ప్రభుత్వానికి లేదు. ఇక నిర్మించిన ఇళ్లను ఇవ్వడం లేదని లబ్దిదారులు ఆగ్రహంతో ఉన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు అదుపుచేయకపోవడం, పన్నులు పెంచడంతో ఆర్ధిక భారం పడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగాల భర్తీ జరగక, స్వయం ఉపాధికి అవకాశాలు ఇవ్వక యువత మండిపడుతున్నారు. స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వక, కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించడంతో గ్రామీణాభివృద్ధి జరగక స్ధానిక సంస్థలు సమస్యల పాలయ్యాయి. 


రెండో విడతలో అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించండి - కేంద్రమంత్రికి జీవీఎల్ లేఖ !


ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని ఏపీ బీజేపీ అంచనా


ఉద్యోగులకూ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు తప్పడం లేదన్నారు. అవసరాల కోసం దరఖాస్తులు చేసినా జీపీఎఎఫ్‌ నుంచి డబ్బు ఇవ్వకపోవడం, పాత పెన్షన్‌ విధానం అమలు హామీని నెరవేర్చకపోవడంతో ప్రభుత్వోద్యోగులు కోపంతో ఉన్నారు. ప్రజాపోరు సభల్లో వెల్లువెత్తిన ప్రజాగ్రహ మంటల సెగ ప్రభుత్వానికి తగిలింది. ప్రజల నుంచి లభించిన ఈ అద్వితీయ మద్దతుతో  భారతీయ జనతా పార్టీ  ప్రజల తరుపున నిరంతరం ఉద్యమమిస్తామని విష్ణువర్ధన రెడ్డి హామీ ఇచ్చారు.  


వేరే పనుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ - మునుగోడు షెడ్యూల్‌ బీజేపీకి అడ్వాంటేజ్ ?