Chandrababu: వెక్కి వెక్కి ఏడ్చేసిన చంద్రబాబు.. తీవ్ర భావోద్వేగంతో ప్రెస్ మీట్

కేంద్ర ప్రభుత్వం 3 సాగు చట్టాలపై వెనక్కి తగ్గినట్లుగానే.. ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల అంశాన్ని ఉపసంహరించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

ABP Desam Last Updated: 19 Nov 2021 01:58 PM
మా అమ్మ, సోదరి, బాబాయ్ గురించి చంద్రబాబు మాట్లాడారు: జగన్

ప్రతిపక్షనేత చంద్రబాబుకు తన రాజకీయ అజెండానే ముఖ్యమని, ప్రజల ఎలా పోయినా పట్టించుకోరని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండోరోజు సభ వాడీవేడిగా సాగింది. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని, హైడ్రామా చేస్తున్నారని.. సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని చెప్పారు. మా అమ్మ, సోదరి, బాబాయ్‌ గురించి చంద్రబాబే మాట్లాడారని సభలో ప్రస్తావించారు. కుప్పం ప్రజలు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని ఏపీ ప్రజలకు తెలుసునని, విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తమని ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.

ఒక కన్ను ఇంకో కన్నును ఎలా పొడుచుకుంటుంది?: జగన్

‘‘వైఎస్ వివేకానంద రెడ్డి నాకు చిన్నాన్న.. చంద్రబాబుకు కాదు.. వైఎస్ అవినాశ్ రెడ్డి కూడా నా ఇంకో చిన్నాన్న కొడుకు.. నాకు సోదరుడే. అలాంటిది వివేకా హత్య కేసులో ఆయన పాత్ర ఎలా ఉంటుంది. ఒక కన్ను ఇంకో కన్నును ఎలా పొడుచుకుంటుంది? వివేకా హత్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే జరిగింది. మా చిన్నాన్న వివేకాను వాళ్లే ఏమైనా చేసుండాలి. చంద్రబాబు మా కుటుంబాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్రస్టేషన్‌లో ఏదోదో మాట్లాడుతున్నారు.. శపథాలు చేసి అసెంబ్లీలోకి రాబోమని తేల్చి చెప్పి వెళ్లిపోయారు’’ అని సీఎం జగన్ అసెంబ్లీలో అన్నారు.

ప్రెస్ మీట్‌లో వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ శాసన సభలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభలో తన భార్య భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సభలో అధికార పక్షం చేసిన తీరు పట్ల ఆవేదన చెందుతూ వెక్కి వెక్కి ఏడ్చారు. 

వ్యక్తిగతంగా దూషించారని చంద్రబాబు ఆవేదన

సీనియర్ నేతను, పలుమార్లు సీఎంగా చేసిన వ్యక్తిని అయినప్పటికీ తనను వ్యక్తిగతంగా దూషించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా భరించానని.. కానీ తన భార్యపై సైతం వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి సభలో తాను ఉండలేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై అధికార పార్టీ ఫోకస్ చేస్తే అందరికీ ప్రయోజనకరమని వ్యాఖ్యానించారు.

సీఎంగానే ఏపీ అసెంబ్లీలో మళ్లీ కాలుపెడతా: చంద్రబాబు

రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. సీఎంగానే తాను సభలో అడుగుపెడతానని ప్రతిపక్ష నేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. గతంలో ఎన్నో సభలు, సమావేశాలలో పాల్గొన్నాను కానీ ఇలాంటి అవమానం ఎప్పుడూ ఎదుర్కొలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

Background

కేంద్ర ప్రభుత్వం 3 సాగు చట్టాలపై వెనక్కి తగ్గినట్లుగానే.. ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల అంశాన్ని ఉపసంహరించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. సీఎంగానే తాను సభలో అడుగుపెడతానని ప్రతిపక్ష నేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. గతంలో ఎన్నో సభలు, సమావేశాలలో పాల్గొన్నాను కానీ ఇలాంటి అవమానం ఎప్పుడూ ఎదుర్కొలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు విషయంలో ఓ మార్షల్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం కలకలం రేపింది. చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న సమయంలో  సభలో మార్షల్‌గా వ్యవహరించిన వ్యక్తి రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీయడం ప్రారంభించారు. ఈ విషయాన్ని చంద్రబాబు భద్రతా సిబ్బంది గుర్తించి వెంటనే ఆ మార్షల్‌ను అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబుకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. మార్షల్ ఎందుకు రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీస్తున్నార్నదానిపై  చంద్రబాబు సెక్యూరిటీ ఆ మార్షల్‌ను ప్రశ్నిస్తున్న సమయంలో హుటాహుటిన చీఫ్ మార్షల్ వచ్చి చంద్రబాబుకు క్షమాపమ చెప్పారు. 


రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీస్తున్న మార్షల్‌ను విడిపించుకుని వెళ్లారు. మార్షల్స్ వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభలోనూ ప్రస్తావించారు. ఇలా ఫోటోలు తీసిన అంశం స్పీకర్ అనుమతితోనే జరిగిందా అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం తనకు సమాచారం లేదని.. అలా ఫోటోలు, వీడియోలు తీసిన విషయం తనకు తెలియదన్నారు. ఏం జరిగిందో తెలుసుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 
Also Read: సంబరాలే కాదు సమీక్ష కూడా చేసుకోవాలి.. వైఎస్ఆర్‌సీపీకి సంకేతాలిస్తున్న ఫలితాలు !


చంద్రబాబు భద్రత విషయంలో తమకు అనుమానాలున్నాయని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఉద్దేశంతో మార్షల్ రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీస్తున్నారో విచారణ చేయించాలని కోరుతున్నారు. సాధారణంగా మార్షల్స్ విధులు వేరుగా ఉంటాయి. అందరూ ప్రజాప్రతినిధులే వస్తారు కాబట్టి వారి భద్రతా కోణంలోనూ వారి విధులను చాలా స్ట్రిక్ట్‌గా నిర్వచిస్తారు. 
Also Read: చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో వర్ష బీభత్సం... వరద ముంపులో తిరుపతి... జనజీవనం అస్తవ్యస్థం


అందుకే ఏకంగా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఓ ప్రతిపక్ష నేత దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించడం  కలకలం రేపుతోంది. అలా  తీస్తున్నప్పుడు పట్టుకున్నది జడ్ ప్లస్ సెక్యూరిటీ సిబ్బంది కావడంతో వారు తమ సెక్యూరిటీ రివ్యూలో భాగంగా దీన్ని తమ పై అధికారులకు తెలియచేసే అవకాశం ఉంది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.