Assembly Live Updates: సభా కార్యకలాపాలకు ఆటంకం కల్గించారని అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులపై వేటు

AP Assembly: తెలుగు రాష్ట్రాలు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం అవుతున్నాయి. ఏపీలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా తెలంగాణలో ఈ నెల 8 నుంతి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Ganesh Guptha Last Updated: 06 Feb 2024 10:45 AM
అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్సన్ వేటు

ఉదయం నుంచి స్పీకర పోడియం వద్ద ఉంటూ సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించారన్న కారణంతో టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. టీ బ్రేక్ ఇచ్చిన తర్వాత కూడా మరింత రెచ్చిపోయిన టీడీపీ సభ్యులు విజిల్స్ వేస్తూ నినాదాలు చేశారు. దీంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 

అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం- టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం

తీవ్ర గందరగోళం మధ్యే అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఇటీవల కాలంలో చనిపోయిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపిన తర్వాత గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభించింది అధికార పార్టీ. ప్రజా సమస్యలపై ముందు చర్చించాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. వాటిపైనే చర్చ జరగాలని స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఈ టైంలో పేపర్లు చించి విసరడంపై అధికార పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్‌

గవర్నర్‌తో ప్రభుత్వం అబద్దాలు చెప్పించిందని టీడీపీ ఆరోపించింది. అందుకే సభ నుంచి టీడీపీ వాకౌట్‌ చేసింది. 

సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి: గవర్నర్

సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేస్తున్న తమ ప్రభుత్వం ఇప్పటివరకూ 4 బడ్జెట్లు ప్రవేశపెట్టిందన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విజయవాడలో అతి పెద్ద అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించామన్నారు. అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు అభినందనీయమన్నార. తమది పేదల ప్రభుత్వమని... ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్నామన్నారు. నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. పేద పిల్లలకు గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అందిస్తున్నామన్నారు. మనబడి నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపరేఖలు మార్చామన్నారు. విద్యారంగంపై రూ. 73, 417 కోట్లు ఖర్చు చేశామన్నారు. 

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్‌: గవర్నర్‌

ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా బోధన మార్చేశామన్నారు గవర్నర్. 8,9 తరగతుల విద్యార్థులకు 9, 52, 925 ట్యాబ్‌లు పంపిణీ చేశామన్నారు. వచ్చే ఏడాది జూన్‌ నుంచి 1వ తరగతి నుంచి ఐబీ విధానం తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. ప్రతి ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తామన్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నామన్నారు. అత్యున్నత విద్యాసంస్థల్లో గుర్తించిన 21 ఫ్యాక్టరీలలో ఏ విభాగంలోనేనా విదేశీ విద్యను అభ్యసించవచ్చన్నారు. ఇందుకోసం రూ. 1.25 కోట్లు వరకు మొత్తం ఫీజులు రీయింబర్స్‌ చేస్తున్నామని పేర్కొన్నారు.


ప్రభుత్వ కృషితో స్కూళ్లలో డ్రాప్‌ఔట్‌లు గణనీయంగా తగ్గించామన్నారు. ఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని... 26.98 లక్షల మంది విద్యార్థులకు రూ. 11.901 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చామని తెలిపారు. 1 నుంచి 10 తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తూ పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నామని ప్రసంగంలో వివరించారు. ఇప్పటివరకూ గోరుముద్దకు రూ. 4,417 కోట్లు ఖర్చు చేశామన్నారు. జగనన్న గోరుముద్ద కోసం ఏటా రూ. 1, 910 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటివరకూ రూ. 3, 367 కోట్లు ఖర్చు చేశామన్నారు. విద్యాసంస్కరణల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ కీలకమైందన్నారు గవర్నర్. 

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం దిశగా పాలన: గవర్నర్

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆరోగ్యం విషయంలో కూడా చాలా సంస్కరణలు తీసుకొచ్చినట్టు గవర్నర్ తెలిపారు. నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపరిచామని చెప్పుకొచ్చారు. 53 ఏరియా ఆసుపత్రుల్లో, 9 జిల్లా ఆసుపత్రుల్లో, 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు డెవలప్‌ చేసినట్టు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10, 132 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు సిద్ధం చేశామన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారా మెడికల్‌ సిబ్బందిని నియమించామన్నారు. ఇప్పటివరకూ రూ. 1.32 కోట్లు రోగులకు అందించినట్టు పేర్కొన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టామన్నారు. 

ఏపీలో మానవాభివృద్ధి సూచికను పెంచుతున్నాం: గవర్నర్

ఇచ్చిన హామీలు మా ప్రభుత్వం అమలు చేసింది. రైతులు, యువకులు, మహిళలు, ఇతర అన్ని వర్గాల ప్రజలకు మా పథకాలతో ఆర్థికంగా బాగుపడ్డారు. ఇప్పటి వరకు నాలుగు బడ్జెట్ ప్రవేశ పెట్టింది. విజయవాడలో 216 అడుగుల అంబేడ్కర్ విగ్రాన్ని ఆవిష్కరించాం. అధికారంలోకి రాగానే విద్యపై ప్రత్యకే దృష్టి పెట్టాం. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. మానవాభివృద్ధి సూచికను పెంచేందుకు నవరత్నాలు తీసుకొచ్చాం. సాంఘీక న్యాయం కోసం మా ప్రభుత్వం పని చేస్తోంది. - గవర్నర్ 

ఏపీలో మానవాభివృద్ధి సూచికను పెంచుతున్నాం: గవర్నర్

ఇచ్చిన హామీలు మా ప్రభుత్వం అమలు చేసింది. రైతులు, యువకులు, మహిళలు, ఇతర అన్ని వర్గాల ప్రజలకు మా పథకాలతో ఆర్థికంగా బాగుపడ్డారు. ఇప్పటి వరకు నాలుగు బడ్జెట్ ప్రవేశ పెట్టింది. విజయవాడలో 216 అడుగుల అంబేడ్కర్ విగ్రాన్ని ఆవిష్కరించాం. అధికారంలోకి రాగానే విద్యపై ప్రత్యకే దృష్టి పెట్టాం. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. మానవాభివృద్ధి సూచికను పెంచేందుకు నవరత్నాలు తీసుకొచ్చాం. సాంఘీక న్యాయం కోసం మా ప్రభుత్వం పని చేస్తోంది. - గవర్నర్ 

ఐదేళ్లు చేసిన పనులు, చేపట్టిన పథకాలను వివరిస్తున్న గవర్నర్

ఐదేళ్లలో చేపట్టిన పనులు, మేనిఫెస్టో అమలపైనే సాగుతున్న ప్రసంగం. ఇదే ఆఖరి సమావేశం కావడంతో వాటిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన ప్రభుత్వం. గవర్నర్ ప్రసంగం కూడా అదే తీరున సాగుతోంది. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం- ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్‌

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్ ప్రసంగిస్తున్నారు. 

Background

AP Assembly Sessions: ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో సోమ‌వారం నుంచి రాజ‌కీయాలు మ‌రో రూపును సంత‌రించుకోనున్నాయి. ఏపీ(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. ఏపీలో సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశం జరగనుంది. కాగా, ఏపీ పదిహేనవ అసెంబ్లీకి ఇవే చివరి సమావేశాలు. ఇక, తెలంగాణలో ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దీంతో ఇప్పటి వ‌ర‌కు బ‌హిరంగ వేదిక‌ల‌పై.. విమ‌ర్శ‌లు గుప్పించుకున్న ప్ర‌భుత్వ, ప్ర‌తిప‌క్ష పార్టీలు.. అసెంబ్లీల వేదిక‌గా తమ వాణి వినిపించనున్నాయి. తెలంగాణ‌లో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌లు, ఏపీలో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు పైచేయి సాధించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న నేప‌థ్యంలో ఈ స‌భా వేదిక‌గా.. తమ త‌మ వ్యూహాల‌ను ర‌క్తికట్టించ‌నున్నాయ‌ని తెలుస్తోంది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.