AP Assembly :  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను మార్చి 14 నుంచి నిర్వహించాలని నిర్ణయించారు.  పది  రోజుల  పాటు  అసెంబ్లీ  సమావేశాలు జరిగే  అవకాశం ఉంది. .కొన్ని  కీలక  అంశాలకు  సంబంధించి  అసెంబ్లీ  వేదికగా  సీఎం  జగన్  మాట్లాడనున్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల మొదటి  రోజు  గవర్నర్  ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత  బీఏసీ  సమావేశం  జరుగుతుంది.  అసెంబ్లీ  సమావేశాలు  ఎన్ని రోజులు  నిర్వహించాలి... బడ్జెట్  ఎప్పుడు  పెడతారు  అనేది  బీఏసీ  లో  నిర్ణయం  తీసుకుంటారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా మూడు రాజధానుల అంశం చర్చకు వస్తుంది. ఈ సారి కూడా సీఎం  జగన్ మూడు రాజధానుల అంశంపై ఏపీ అసెంబ్లిలో ప్రకటన చేయనున్నారు.                          


అసెంబ్లీ  వేదికగా  సీఎం  జగన్  మూడు  రాజధానులు... రాష్ట్రంలో  జరుగుతున్న  అభివృద్ధి  . సంక్షేమ  పథకాలకు  సంబంధించి  మాట్లాడే  అవకాశం  ఉంది...ఎన్నికలకు  ముందు  జరిగే  బడ్జెట్  సమావేశాలు  కాబట్టి  ఈ సారి  కొన్ని  రంగాలకు  అధిక  ప్రాధాన్యత  ఇవ్వనున్నారు.....వ్యవసాయ  విద్య వైద్య  రంగాలకు  ప్రాధాన్యత  ఇవ్వనున్నారు. అదే  విధంగా  మహిళలకు  కూడా  ప్రాధాన్యత  ఇచ్చే విధంగా  బడ్జెట్  కేటాయింపులు ఉండనున్నట్లుా తెలుస్తోంది.  ఏపీ రెవెన్యూ ఆశించినంతగా లేకపోవడంతో  కేంద్ర పన్నుల వాటాపైనే రాష్ట్రప్రభుత్వం ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. రెవెన్యూ లోటు భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయినా సంక్షేమ పథకాలకు కేటాయింపుల్లో మాత్రం ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదంటుంది.                  


ఈ సారి బడ్జెట్‌లో మళ్లీ సంక్షేమానికి పెద్ద పీట వేస్తారా లేక పన్నుల ప్రతిపాదిస్తారా అని వేచిచూడాల్సి ఉంది. అలాగే ఆదాయ మార్గాల అన్వేషణపై కూడా ఉత్కంఠ నెలకొంది. బడ్జెట్ లో ముఖ్యంగా నవరత్నాల పేరుతో అమలు చేసే సంక్షేమ పథకాలకు ఎక్కువగా కేటాయించే అవకాశం ఉంది. మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్నందున సంక్షేమానికే ప్రభుత్వం పెద్దపేట వేసే అవకాశం ఉంది. వీటితో పాటు జగనన్న కాలనీలు, విద్య, వైద్యానికి కేటాయింపులు పెరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలతో పాటు కొత్తవాటికి ఏమైనా కేటాయింపులు చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఏడాది కావడంతో..  బడ్జెట్ ఖరారు చేయడం ఆర్థిక శాఖ అధికారులకు సవాల్‌గామారింది.                    


అసెంబ్లీలో   ఈ సారి  కూడా   టీడీపీ కూడా  కీలక  అంశాలకు  సంబంధించి అసెంబ్లీ  లో చర్చ  లెవనెత్తే పరిస్థితి కనిపిస్తోంది.... పెరిగిన ధరలు.. రాష్ట్రంలో  లా అండ్  ఆర్డర్  ఇతర  అంశాలపై  టీడీపీ  చర్చ కు పట్టు  బట్టే  అవకాశాలు ఉన్నాయి .....మొత్తానికి  కొంత  వాడి  వేడిగా నే  ఈ  సారి  ఏపీ  అసెంబ్లీ   బడ్జెట్ సమావేశాలు ఉండనున్నాయి.