ఏపీలో కరోనా కేసులకు సంబంధించిన తాజా హెల్త్ బులెటిన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీలో కొత్తగా 1,367 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం 20,34,786 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో 14 మంది చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మొత్తం 14,044 మంది మరణించినట్లయింది. ఏపీలో  ప్రస్తుతం 14,705 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 20,06,034 మంది రికవరీ అయ్యారు. 


గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 61,178 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కరోనా వల్ల చిత్తూరు జిల్లాలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, క్రిష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు చొప్పున మరణించారు. ఇప్పటిదాకా ఏపీలో 2,75,36,639 కరోనా పరీక్షలు నిర్వహించినట్లుగా మీడియా బులెటిన్‌లో పేర్కొన్నారు.


Also Read: Rape Accused Death: కామాంధుడు రాజు మృతిపై తల్లి సంచలన ఆరోపణలు.. భార్య కూడా, మరోలా మాట్లాడిన అత్త






తెలంగాణలో 259 కొత్త కేసులు తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 58,261 కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో నుంచి 259 కొత్తగా కరోనా కేసులను గుర్తించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,62,785కి చేరింది. దీనికి సంబంధించిన హెల్త్ బులెటిన్‌ను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసింది. గత 24 గంటల సమయంలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,900 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఒక్కరోజు వ్యవధిలో 301 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,53,603కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,282 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.


Also Read: Warangal: రేప్ కేసు నిందితుడు రాజు అంత్యక్రియలు పూర్తి.. ఊళ్లోకి రానివ్వని గ్రామస్థులు, చివరికి..