AP coast Cyclone: భారత వాతావరణ శాఖ ఏపీకి తుపాను హెచ్చరికలు జారీ చేసింది. మలక్కా జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రమైన వాయుగుండంగా మారుతోంది. రాబోయే 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుపాను గా బలపడే అవకాశం ఉందని IMD తెలిపింది. ఈ వ్యవస్థ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులకు గురువారం నుంచి సముద్రంలో వేటకు వెళ్లవద్దని ఆంక్షలు విధించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. IMD మంగళవారం ఉదయం విడుదల చేసిన నివేదిక ప్రకారం మలక్కా జలసంధి మరియు సమీప సౌత్ అండమాన్ సముద్రంలో ఏర్పడిన వెల్-మార్క్డ్ లో-ప్రెషర్ ఏరియా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ డిప్రెషన్‌గా మారింది. రాగల 6 గంటల్లో ఇది మరింత బలపడి, వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. "ఈ వ్యవస్థ తీవ్రమై, దక్షిణ బంగాళాఖాతంలో తుపాను 'సెన్యార్'గా రూపొందుతుంది. దీని ప్రభావంతో దక్షిణ భారత తీరాల్లో గాలుల వేగం పెరిగి, భారీ వర్షాలు కురవని అంచనా.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో కొమోరిన్ ప్రాంతం, నైరుతి బంగాళాఖాతం మరియు శ్రీలంక సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో ఇది బలపడి, మరో వాయుగుండంగా మారే అవకాశం ఉందని IMD నివేదికలు సూచిస్తున్నాయి. విశాఖపట్నం, కొనసీమ, ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో 5-10 సెం.మీ. వర్షపాతం రావచ్చని అంచనా. తమిళనాడు, కేరళలో కూడా భారీ వర్షాలు, ఎట్టడి ప్రమాదాలు తప్పనిసరి అవుతాయి. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున, రానున్న 48 గంటల్లో తుఫాను తీవ్రత పెరిగే ప్రమాదం ఉందిని..ఈ నేపద్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ముఖ్యంగా వరి కోతలు కోసిన రైతులు వెంటనే తమ పంటను/ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. రైతులకు ధాన్యం కాపాడుకునేందుకు వీలుగా, ప్రభుత్వం తరపున ఉచితంగా టార్పలిన్ పట్టాలు పంపిణీ చేస్తున్నాం. జిల్లా యంత్రాంగం ద్వారా వాటిని సద్వినియోగం చేసుకోవాలననాు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు, రైతాంగానికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.