Best Cars For Senior Citizen India: మన తెలుగు రాష్ట్రాల్లో రోడ్ల మీద ఎక్కువగా లాంగ్‌డ్రైవ్‌లు చేసే పెద్దలకు, ప్రత్యేకంగా సీనియర్‌ సిటిజన్లకు ఒక సరైన ఆటోమేటిక్‌ కార్‌ చాలా కీలకం. వయస్సు పెరుగుతున్నకొద్దీ గేర్‌ మార్చడం, క్లచ్‌ నొక్కడం వంటి పనులు తగ్గితే డ్రైవింగ్‌ మరింత సులభం అవుతుంది. అందుకే చాలామంది “సేఫ్‌, స్మూత్‌, హాసిల్‌-ఫ్రీ” అనుభవం ఇచ్చే ఆటోమేటిక్‌ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

Continues below advertisement

రూ.15 లక్షల ఆన్‌-రోడ్‌ బడ్జెట్‌లో ఇలాంటి అవసరాలన్నీ సంపూర్ణంగా నెరవేర్చే కారుగా Hyundai Venue Automatic ని ఎంచుకోవచ్చు. నేటి పరిస్థితుల్లో, సీనియర్‌ సిటిజన్ల అవసరాలకు ఇది చాలా లాజికల్‌గా సరిపోతుంది.

Hyundai Venue ఎందుకు సీనియర్‌ సిటిజన్లకు బెస్ట్‌?

Continues below advertisement

Hyundai బ్రాండ్‌ అంటే మన దేశంలోనే కాదు, హైదరాబాద్‌, విజయవాడ వంటి అన్ని తెలుగు నగరాల్లో కూడా “నమ్మకమైన సర్వీస్‌ నెట్‌వర్క్‌”కి పేరుగాంచింది. పెద్దవాళ్ల కోసం కారు తీసుకున్నప్పుడు ఏదైనా చిన్న సమస్య వచ్చినా దగ్గరలోనే సర్వీస్‌ అందుబాటులో ఉండడం ఒక పెద్ద ప్లస్‌ పాయింట్‌.

Venue ఆటోమేటిక్‌ వెర్షన్‌ డ్రైవింగ్‌ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. స్టీరింగ్‌ లైట్‌గా ఉంటుంది, కూర్చునే పొజిషన్‌ కొంచెం హైట్‌లో ఉండటం వల్ల రోడ్డు క్లియర్‌గా కనిపిస్తుంది. సీనియర్‌ సిటిజన్లకి ఇది చాలా పెద్ద ప్రయోజనం.

వెన్యూ పెట్రోల్‌ & డీజిల్‌ - ఏది మంచిది?

రూ. 15 లక్షలలో మీరు రెండు ఆటోమేటిక్‌ ఆప్షన్లు పొందొచ్చు.

1. పెట్రోల్‌ ఆటోమేటిక్‌ (స్మూత్‌ & నిశ్శబ్దం)

ఇంజిన్‌ రిఫైన్‌డ్‌గా ఉంటుంది

గేర్‌ షిఫ్ట్స్‌ చాలా స్మూత్‌

నగరం & హైవే రెండింటికీ ఇట్టే సరిపోతుంది

మెయింటెనెన్స్‌ కూడా తక్కువే

2. డీజిల్‌ ఆటోమేటిక్‌ (టార్క్‌ ఎక్కువ, లాంగ్‌డ్రైవ్‌కి పర్ఫెక్ట్‌)

ఏడాదికి 10,000 నుంచి 15,000 km రన్నింగ్‌ ఉన్నవాళ్లకి ఆర్థికంగా ఊరట

మైలేజ్‌ ఎక్కువ

హైవే మీద స్థిరత్వం బాగుంటుంది

అయితే, డీజిల్‌ ఆటోమేటిక్‌ తీసుకోవాలనుకుంటే, ఈ బడ్జెట్‌లో కొంచెం తక్కువ ఫీచర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అయినా కూడా పెర్ఫార్మెన్స్‌ విషయంలో మాత్రం సీనియర్‌ సిటిజన్‌కు కావాల్సిన కంఫర్ట్‌ పూర్తి స్థాయిలో ఇస్తుంది.

Hyundai Venueలో లభించే సేఫ్టీ ఫీచర్లు:

  • సిక్స్‌ ఎయిర్‌బ్యాగ్స్‌
  • ABS, EBD
  • హిల్‌ అసిస్ట్‌
  • ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌
  • రియర్‌వ్యూ కెమెరా

పెద్దవాళ్లు లాంగ్‌డ్రైవ్‌ చేసినా ఈ ఫీచర్లు అందించే నమ్మకంతో హ్యాపీగా సాగిపోవచ్చు.

హైదరాబాద్‌ & విజయవాడలో ధరలు ఎలా ఉంటాయి?

Hyundai Venue ఆటోమేటిక్‌ పెట్రోల్‌ ఆన్‌-రోడ్‌ ప్రైస్‌ ధర 

  • హైదరాబాద్‌లో: సుమారు రూ. 13.5 -రూ. 14.8 లక్షల మధ్య
  • విజయవాడలో: సుమారు రూ. 13.8 - రూ. 15 లక్షల మధ్య

ఈ ప్రైస్‌ రేంజ్‌లో, పెట్రోల్‌ వెర్షన్‌తో పోలిస్తే డీజిల్‌ ఆటోమేటిక్‌ వెర్షన్‌ కొన్ని తక్కువ ఫీచర్లు తగ్గి వస్తుంది. కానీ కంఫర్ట్‌ & మైలేజ్‌ విషయంలో మాత్రం అద్భుతంగా ఉంటుంది.

స్మూత్‌ రైడ్‌, హైవే స్టేబిలిటీ, నమ్మకమైన బ్రాండ్‌, తక్కువ మెయింటెనెన్స్‌, రూ.15 లక్షలు దాటని బడ్జెట్‌ - ఈ అన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే, Hyundai Venue Automatic సీనియర్‌ సిటిజన్లకు పర్ఫెక్ట్‌ ఎంపిక. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.