Breaking News: ఆరేళ్ల చిన్నారి తల్లిదండ్రుల వద్దకు వైఎస్ విజయమ్మ.. బాధితులను ఓదార్చుతూ కంటతడి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 15న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 15 Sep 2021 10:36 PM
వైఎస్ విజయమ్మ పరామర్శ

సైదాబాద్‌లో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని వైఎస్‌ విజయమ్మ పరామర్శించారు. బుధవారం సాయంత్రం బాలిక తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన విజయమ్మ వారిని ఓదార్చారు. అఘాయిత్యంపై చలించిన విజయమ్మ వారి ఎదుటే భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆ వీధి చివరే వైఎస్ షర్మిల దీక్ష చేస్తుండగా.. అక్కడికి వెళ్లి ఆమెతో పాటు దీక్షలో కూర్చున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు దీక్ష చేస్తానని ఇప్పటికే షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇప్పటిదాకా 76 కోట్ల వ్యాక్సిన్ డోసులు

భారత్‌లో ఇప్పటిదాకా మొత్తం 76 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేడు ఒక్కరోజే 57 లక్షల డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా వెల్లడించింది.





5G spectrum auctions: వచ్చే ఏడాది మొదటి రెండు నెలల్లో 5G స్పెక్ట్రమ్‌ వేలం ఉండే ఛాన్స్‌

5G స్పెక్ట్రమ్‌ వేలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగొచ్చని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. జనవరికి మారే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. 

నంద్యాలలో దారుణ హత్య

కర్నూలు జిల్లా నంద్యాల బాలాజీ కాంప్లెక్స్‌లో దారుణ హత్య చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తిని మర్చంట్ జనరల్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరువీధి వెంకట సుబ్బయ్యగా గుర్తించారు. ప్రత్యర్థులు అతణ్ని వేటకొడవళ్ళతో నరికి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు.

సీఎం జగన్‌తో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సమావేశం

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. మర్యాదకపూర్వకంగా సమావేశమైనట్టు సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. ఈ భేటీలో టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కూడా పాల్గొన్నారు. 

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ముగిసిన నటి ముమై‌త్ ఖాన్ విచారణ.. బ్యాంకు ఖాతా, ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నలు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ నటి ముమై‌త్ ఖాన్ విచారణ ముగిసింది. బుధవారం నాడు ఈడీ కార్యాలయంలో దాదాపు 7 గంటలపాటు ముమైత్ ఖాన్‌ను బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలపై అధికారులు ప్రశ్నించారు. తనకు ముంబైలో రెండు బ్యాంకు ఖాతాలున్నాయని ఈడీ అధికారులకు ముమైత్ వెల్లడించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నిందితుడు కెల్విన్ తో సంబంధాలపై ముమైన్‌ను ఈడీ ప్రశ్నించింది.

తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి సభ్యులు వీళ్లే

టిటిడి పాలకమండలి సభ్యులు



  1. పోలకల అశోక్ కుమార్ 

  2. మల్లాడి క్రిష్ణారావు

  3. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

  4. కాటసాని రాంభూపాల్‌రెడ్డి

  5. గొర్ల బాబురావు

  6. మధుసూదన్ యాదవ్

  7. జీవన్‌ రెడ్డి, 

  8. జూపల్లి రామేశ్వరావు

  9. లక్ష్మినారాయణ

  10. పార్దసారథి రెడ్డి

  11. మూరంశెట్టి రాములు

  12. కల్వకుర్తి విద్యాసాగర్

  13. రాజేశ్‌ శర్మ 

  14. నందకుమార్

  15. శంకర్

  16. శశిధర్ రెడ్డి

  17. విశ్వనాథ్‌రెడ్డి

  18. కన్నయ్య

  19. కేతన్ దేశాయ్

  20. మిలింద్

  21. శ్రీనివాసన్‌

  22. మారుతి

  23. సౌరబ్‌

యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ

యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. రామన్నపేట శివారులోని డిగ్రీ కాలేజ్ సమీపాన ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

సైదాబాద్ సింగరేణికాలనీలో వైఎస్​ షర్మిల దీక్ష


సైదాబాద్ సింగరేణికాలనీలో వైఎస్​ షర్మిల దీక్షకు కూర్చున్నారు. హత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. అందరం అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా... నిందితున్ని పట్టుకోకపోవటంపై ప్రభుత్వంపై మండిపడ్డారు. బాధిత కుటుంబంతో కలిసి దీక్ష ప్రారంభించారు. హత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించే వరకూ దీక్ష చేస్తానని షర్మిల స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి పదికోట్ల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న ప్రాంతమే.. ఇలా ఉంటే రాష్ట్ర పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామరాజు పిటిషన్ కొట్టివేత

సీబీఐ కోర్టులో ఎంపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఊరట లభించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. వైఎస్ జగన్ వాదనలను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. రఘురామ కృష్ణంరాజు పిటిషన్‌ను కొట్టివేయడంతో ఏపీ సీఎంకు ఊరట లభించింది.

కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు ఐఏఎస్​ అధికారులకు శిక్ష ఖరారు!

కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు అధికారులకు శిక్ష ఖరారు చేయనున్నట్టు ఏపీ హైకోర్టు తెలిపింది. పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరికి ఈనెల 29 న శిక్ష ఖరారు చేస్తామని న్యాయస్థానం తెలిపింది. ఇవాళ కోర్టుకు రానందున పూనం మాలకొండయ్యకు ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది హైకోర్టు. ఈనెల 29 న కోర్టుకు హాజరు కావాలని మాలకొండయ్యకు ఆదేశాలిచ్చింది. సెరికల్చర్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని గతంలో ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆదేశాలు అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద విచారణ చేసింది.

సాక్షి వెబ్ మీడియా కోర్టు ధిక్కరణ కేసు తెలంగాణ హైకోర్టుకు బదిలీ


సాక్షి వెబ్ మీడియాపై రఘురామకృష్ణరాజు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్టు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేశారని సాక్షి వెబ్ మీడియాలో కథనంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ రఘురామ వేశారు. కోర్టు ధిక్కరణ కేసులో చర్యలు తీసుకునే అధికారం హైకోర్టుకు ఉండటంతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బదిలీ చేసింది.

జగన్, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ల బదిలీకి హైకోర్టు నిరాకరణ

ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ల బదిలీకి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలన్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. మరోవైపు జగన్, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపై కాసేపట్లో  సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించనుంది.

మరికొద్దిసేపట్లో సైదాబాద్ సింగరేణి కాలనీకి పవన్ కల్యాణ్.. చిన్నారి కుటుంబానికి పరామర్శ

హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి బస్తీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్నారు. హత్యాచార బాధితురాలు  కుటుంబాన్ని పరామర్శించనున్నారు. మరికొద్దిసేపట్లో జూబ్లీహిల్స్ కేంద్ర కార్యాలయం నుంచి బయలుదేరుతారు.

డ్రగ్స్ కేసులో ఈడీ ముందు హాజరైన నటి ముమైత్ ఖాన్

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు నటి ముమైత్‌ఖాన్‌ హాజరయ్యారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆమె బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాల గురించి ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు.

ఒడిశా తీరంలో చిక్కుకున్న విశాఖకు చెందిన 30 మత్స్యకార బోట్లు

ఒడిశా తీరంలో విశాఖకు చెందిన 30 మత్స్యకార బోట్లు చిక్కుకున్నాయి.  మత్స్యకారుల సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గంజాం పోర్టు అధికారులతో మత్స్య శాఖ జేడీ లక్ష్మణరావు చర్చలు జరిపారు. గంజాం పోర్టుకు 17 బోట్లు, మిగిలిన బోట్లు తీరానికి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో మహిళను పొడిచి చంపిన దుండగులు

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం మల్లేపల్లి శివారులో దారుణం జరిగింది. మహిళను కత్తులతో పొడిచి దుండగులు హత్య చేశారు. మృతురాలు.. మాడుగుల మండలం చంద్రానిపల్లి వాసి పోచమ్మ(39)గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఇవాళ ఈడీ విచారణకు ముమైత్ ఖాన్


డ్రగ్స్‌ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సినీ నటి ముమైత్​ఖాన్ నేడు ఈడీ అధికారుల ఎదుట హాజరు కానున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలపై అధికారులు ఆమెను ప్రశ్నించనున్నారు. కెల్విన్, వాహిద్​లను ఈడీ అధికారులు మరోసారి ప్రశ్నించే అవకాశం ఉంది.

మావోయిస్టు కీలక నేత దుబాసి శంకర్‌ అరెస్టు

ఏవోబీలోని కొరాపుట్‌, మల్కాన్‌గిరి, విశాఖపట్నం జిల్లాల్లో మావోయిస్టు కీలకనేత దుబాసి శంకర్‌ అలియాస్‌ మహేందర్‌ అలియాస్‌ అరుణ్‌ అలియాస్‌ రమేష్‌ను ఒడిశాలో అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర డీజీపీ అభయ్‌ తెలిపారు.  ‘కొరాపుట్‌ జిల్లా బొయిపరిగుడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పేటగడ అటవీ ప్రాంతంలో ఎస్‌వోజీ, జిల్లా వాలంటరీ దళం, బీఎస్‌ఎఫ్‌, రాష్ట్ర పోలీసులు కూంబింగ్‌ చేసి.. నోయరో గ్రామంలో శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడివద్ద ఇన్సాస్‌ రైఫిల్‌, 10రౌండ్ల బుల్లెట్లు, ఇతర సామగ్రి, రూ.35,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అతడి ఆచూకీ చెప్పినవారికి రూ.20 లక్షల బహుమతి ఇస్తామని గతంలో ప్రకటించాం’ అని ఒడిశా డీజీపీ అభయ్‌ తెలిపారు.

శ్రీవారి సేవలో మంత్రి జయరామ్

తిరుమల శ్రీవారిని ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఎమ్మెల్యే శిల్పా రవి కిషోర్ రెడ్డిని వాహనం ముందు యువకుడి వీరంగం

కర్నూలు జిల్లా నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవి కిషోర్ రెడ్డి వాహనాన్ని యువకుడు అడ్డుకుని వీరంగం సృష్టించాడు. శిల్పా రవి కారును అడ్డుకుని అద్దాలను చేతులతో కొట్టే ప్రయత్నం చేశాడు. వెంటనే శిల్పా అనుచరులు కారు దిగి తాగుబోతును చితకబాదారు. ఈ సంఘటన నంద్యాల శ్రీనివాస సెంటర్ వద్ద చోటుచేసుకుంది. యువకుడు అతిగా త్రాగి ఎమ్మెల్యే వాహనానికి అడ్డుపడి, విచక్షణ రహితంగా ప్రవర్తించినందుకే దాడి జరిగిందని స్థానికులు తెలిపారు.

మానవ అక్రమ రవాణాలో రెండో స్థానం


తెలంగాణలో మానవ అక్రమ రవాణా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ తరహా కేసుల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉంది. జాతీయ నేర గణాంక సంస్థ విడుదల చేసిన నేర వార్షిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా కేసులు 900 నమోదు కాగా.. అత్యధికంగా మహారాష్ట్రలో 154 కేసులున్నాయి. తెలంగాణలో 104 నమోదయ్యాయి.

Background

కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియ కోసం గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ స్థానంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.