Breaking News Live: లఖింపుర్​ ఖేరి ఘటన.. కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ నిరాకరణ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 13న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 13 Oct 2021 10:57 PM

Background

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మళ్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో ఏడో రోజు దుర్గమ్మ అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. ...More

లఖింపుర్​ ఖేరి ఘటన.. కేంద్ర మంత్రి తనయుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ నిరాకరణ

యూపీలోని లఖింపుర్​ ఖేరి హింసాత్మక ఘటన కేసులో విచారణ కొనసాగుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేసింది. ప్రధాన నిందితుడు, కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా తనయుడు ఆశిష్​ మిశ్రా దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను జిల్లా కోర్టు కొట్టివేసింది. ఆశిష్ మిశ్రాకు జిల్లా కోర్టు బెయిల్​​ నిరాకరించింది.