Andhra residents stranded in Nepal reach AP: నేపాల్ లో అంతర్గత సంక్షోభం కారణంగా పర్యాటకులు ఇరుక్కుపోయారు. అక్కడ ఉండిపోయిన వారిలో తెలుగు వాళ్లు కూడా ఉన్నారు. వారందరి గురించి తెలుసుకున్న నారా లోకేష్.. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉండి రెండు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్  ను పర్యవేక్షించారు. ముందుగా నేపాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రులతో కమ్యూనికేట్ అయి.. వారందర్నీ ఖాఠ్మాండూ విమానాశ్రయానికి చేర్చారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా విశాఖకు తీసుకు వచ్చారు. 

144 మందితో విమానం బయలుదేరుతున్న వీడియోను నారా లోకేష్ షేర్ చేసారు. ఇండిగో విమానం   విశాఖపట్నం , తిరుపతికి బయలుదేరింది.   36 గంటల కృషితో వారి ముఖాల్లో కనిపించిన ఆనందం   విలువైనదిగా చేసిందన్నారు.   టీమ్ RTGS, టీమ్ NRT ,  టీమ్ AP భవన్‌లకు వారి అవిశ్రాంత 24x7 మద్దతు ఇచ్చారని అభినందించారు.  

ప్రభుత్వ యంత్రాంగం అంతా సమష్టిగా పని చేసి.. నారా లోకేష్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు మానిటర్ చేసి తెలుగు వారందర్నీ సురక్షితంగా ఏపీకి తీసుకు రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అభినందించారు. 

నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారి కోసం... 2 రోజుల పాటు ప్రతి గంట, ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటూ... ఒక వైపు బాధితులతో మాట్లాడుతూ వారికి ధైర్యం చెబుతూ... మరోవైపు కేంద్రంతో మాట్లాడుతూ... ఇంకోవైపు నుంచి ప్రత్యేక విమానం ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ... లోకేష్ గారు చేసిన ఒక యజ్ఞం విజయవంతమైందన్న ప్రశంసలు లభిస్తున్నాయి. [ 

 ఉత్తరాంధ్ర, కోస్తాలకు చెందిన పర్యాటకుల్ని విశాఖలో.. నలభై మందికిపైగా పర్యాటకుల్ని తిరుపతిలో దించారు.