= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
చంద్రబాబు కర్మఫలం అనుభవిస్తున్నారు : ఎమ్మెల్యే ద్వారంపూడి ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు వివాదంపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు ఎన్టీఆర్ ని ఎంత ఆత్మ క్షోభ పెట్టారో అని వీడియోలను ప్రదర్శించారు. కుప్పం ఓటమితో దిమ్మతిరిగి అసెంబ్లీలో చంద్రబాబు వింత వింతగా ప్రవర్తిస్తున్నారన్న ద్వారంపూడి ఆరోపించారు. ఎన్. టి.రామారావును బాధపెట్టారు కాబట్టి చంద్రబాబు కర్మఫలం అనుభవిస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో గెలుపుకోసం బాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు భార్యను వైసీపీ నేతలు ఒక్కరూ ఏమీ అనలేదన్నారు. ప్రజలందరూ చంద్రబాబు ఏడుపు, యాక్షన్ నమ్మరని తెలిపారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు సీఎం కేసీఆర్ బృందం ఢిల్లీకి వెళ్లనుంది. రెండు రోజుల పాటు అక్కడే ఉండి వ్యవసాయ శాఖ మంత్రి, కార్యదర్శితో పాటు ఇతర శాఖల మంత్రులను.. అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తామని మీడియా సమావేశంలో కేసీఆర్ తెలిపారు. రైతుల మీద పెట్టిన మొత్తం కేసులు ఎత్తివేయాలి- దిశ మీద కేసు ఎత్తివేయాలన్నారు. రైతుల ఉద్యమం ఇలాగే కొనసాగాలని, వారికి అందరూ చేయూత అందించాలన్నారు. సరైన చట్టాలను తీసుకొచ్చి రైతులకు మేలు చేయాలన్నారు. రైతు ఉద్యమంలో చనిపోయిన ప్రతి కుటుంబానికి మూడు లక్షల రూపాయలు అందిస్తున్నామని చెప్పారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
నారావారిపల్లెలోని ఎన్టీఆర్ విగ్రహం ముందు గ్రామస్తుల ధర్నా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుపై, భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రతిపక్షనేత స్వగ్రామం నారావారిపల్లెలోని ఎన్టీఆర్ విగ్రహం ముందు గ్రామస్తుల ధర్నాకు దిగ్గారు. ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టి బిమ్మను ఎన్టీఆర్ విగ్రహం ముందు దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. అంబటి రాంబాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నారావారిపల్లె గ్రామస్తులు మాట్లాడుతూ.. గత రెండున్నర సంవత్సరాలుగా వైఎస్సార్ సీపీ నేతలు చేయని దుర్మార్గాలు లేవని, చంద్రబాబుపై సీఎం జగన్ అనుచరులు బురద జల్లె ప్రయత్నం చేయడం దారుణంమన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే భువనేశ్వరమ్మపై నిన్న అసెంబ్లీలో వైసీపి నేతలు దారుణమైన వ్యాఖ్యలు తగ్గదని హెచ్చరించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
బూతుల మంత్రులు క౦టే మేమే నయ౦.. ప్లకార్డులతో టీడీపీ శ్రేణుల నిరసన శాసనసభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సతీమణిపై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాకినాడ సిటీ మాజీ శాసన సభ్యులు వనమాడి కొండబాబు, టీడీపీ శ్రేణులు నల్ల దుస్తులు ధరించి N.T.R విగ్రహనికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిరసన చేపట్టారు. బూతుల మంత్రులు క౦టే మేమే నయ౦ అనే ప్ల కార్డుతో నిరసన చేపట్టారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఉప్పొంగుతున్న పంబా నది.. శబరిమల యాత్ర నిలిపివేత.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత కొన్నిరోజులుగా దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తమిళనాడుతో పాటు కేరళలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో పంబా నదికి వరద అధికమైంది. భక్తుల భద్రతరీత్యా శబరిమల యాత్ర నిలిపివేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
తమిళనాడులో వరదలో కొట్టుకుపోయిన ఇల్లు తమిళనాడులో భారీవర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వేలూరు జిల్లా, గుడియత్తమ్ నగరంలోని నది ఉప్పొంగి రెండంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. పూర్తిగా వరద నీటిలో కొట్టుకుపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో ముందుగానే.. అందులోని న్యాయవాది ఎలాంగోవన్ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించటం వల్ల ప్రాణనష్టం తప్పింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్ వద్ద ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న ఎనిమిది కార్లు హైదరాబాద్.. పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగ్‌రోడ్ వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకదానికొకటి ఎనిమిది కార్లు ఢీ కొట్టాయి. ప్రమాదంలో వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రాణ నష్టం తప్పింది.