Breaking News Live: బీజేపీ శాంతి ర్యాలీకి పోలీసుల అనుమతి... హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 04 Jan 2022 05:47 PM

Background

సంగారెడ్డిలో ప్రమాదంసంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం, నందిగామ గ్రామ పరిధిలోని సవారియా అనే పైపుల తయారీ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. ఇనుప రాడ్లను క్రేన్ సహాయంతో తీసుకువెళ్తుండగా బరువు ఎక్కువై తీగ తెగి నలుగురు కార్మికులపై పడింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రేమ్...More

బీజేపీ శాంతి ర్యాలీకి పోలీసుల అనుమతి... హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. జేపీ నడ్డాకు బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. జాయింట్ సీపీ కార్తికేయ నడ్డాతో మాట్లాడారు. కరోనా ఆంక్షలను వివరించారు. బీజేపీ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. కేవలం 40 మందితో ర్యాలీకి అనుమతి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. సికింద్రబాద్ గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ వరకు బీజేపీ శాంతి ర్యాలీ చేయనుంది.