Breaking News Live: కిన్నెర మొగిలయ్యకు రూ.కోటి నజరానా ప్రకటించిన సీఎం కేసీఆర్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 28 Jan 2022 08:39 PM

Background

ప్రముఖ చిత్రకారుడు, రచయిత దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి కన్నుమూశారు. సుబ్బరాయశాస్త్రి గురువారం రాత్రి తమిళనాడు రాజధాని చెన్నైలో తుదిశ్వాస విడిచారని సమాచారం. అద్భుతమైన కార్టూన్లు, కథలతో చిన్నారులతో పాటు పెద్దలను సైతం అలరించిన సుబ్బరాయశాస్త్రి కలం పేరు బుజ్జాయి. కార్టూనిస్టుగా, చిన్న పిల్లల...More

కిన్నెర మొగిలయ్యకు రూ.కోటి నజరానా ప్రకటించిన సీఎం కేసీఆర్

తెలంగాణ జానపద కళాకారుడు కిన్నెర మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించారు. రూ. కోటి నజరానా ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే హైదరాబాద్ లో ఇంటి స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కేంద్రం మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.