Breaking News Live: ఇసుక లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు... ప్రయాణికులకు గాయాలు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ములుగు జిల్లా పస్రా తాడ్వాయి మధ్య ఇసుక లారీని ఆర్టీసీ బస్సు ఢీ వెనుక నుంచి కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఆర్టీసీ బస్సు హన్మకొండ నుంచి ఏటూరు నాగారం వస్తున్నట్లు సమాచారం.
పీజీ వైద్య కాలేజీల్లో 2017-2020కి ఫీజుల పెంపు పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేటు వైద్య కాలేజీల్లో 2017-2020కి ఫీజులు పెంచుతూ 2017 మే 9న జీవోలు జారీ అయింది. దీనిపై కొందరు విద్యార్థులు టీఏఎఫ్ఆర్ సీ సిఫార్సు లేకుండా ప్రభుత్వం ఫీజులు పెంచిందంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్ విచారించిన హైకోర్టు పీజీ వైద్య ఫీజుల పెంపుపై తీర్పు వెల్లడించింది. 2016-19కి టీఏఎఫ్ఆర్ సీ ఖరారు చేసిన ఫీజులే తీసుకోవాలని స్పష్టం చేసింది.
డ్రగ్స్ మాఫియా ప్రధాన నిందితుడు టోనీ.. పోలీసులకు చిక్కాడు. తప్పించుకుని తిరుగుతున్న టోనీని టాస్క్ ఫోర్స్ పోలీసులు ముంబాయిలో అరెస్టు చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. ముంబయి కేంద్రంగా డ్రగ్స్ నెట్ వర్క్ నిర్వహిస్తున్న టోనీ దేశంలోని.. ముఖ్య పట్టణాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు.
డ్రగ్స్ మాఫియా ప్రధాన నిందితుడు టోనీ.. పోలీసులకు చిక్కాడు. తప్పించుకుని తిరుగుతున్న టోనీని టాస్క్ ఫోర్స్ పోలీసులు ముంబాయిలో అరెస్టు చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు. ముంబయి కేంద్రంగా డ్రగ్స్ నెట్ వర్క్ నిర్వహిస్తున్న టోనీ దేశంలోని.. ముఖ్య పట్టణాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు.
* బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దాసరి నారాయణ రావు కుమారుడు అరుణ్
* బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సయ్యద్ నగర్‌లో ర్యాష్ డ్రైవింగ్ చేసిన దాసరి అరుణ్
* ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఈ రోజు తెల్లవారు జామున 4 గంటల సమయంలో రెండు బైక్‌లను ఢీకొట్టిన అరుణ్
* డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లుగా పోలీసుల అనుమానం.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్న పోలీసులు
* ఈ కేసు విషయంలో స్టేషన్‌లో పోలీసుల ఎదుట హాజరైన దాసరి అరుణ్
* బ్రీత్ అనలైజ్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్ధుకుంట శ్రీధర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘వల్లభనేని వంశీ అనేవాడు టీడీపీ బీ ఫాంతో గెలిచిన వాడు. మా పార్టీ వాడు కాదు. వైసీపీ బీఫాంతో వంశీ గెలిచాడా? టీడీపీ బీ ఫాంతో గెలిచాడు. వైసీపీ బీ ఫాంతో గెలిచిన వారు ఎవరైనా విమర్శలు చేశారా? టీడీపీ బీఫాంతో గెలిచిన ఎమ్మెల్యే గిచ్చితే చంద్రబాబు ఏడ్చాడు. మిమ్మల్ని అగౌరవ పరచినది వంశీ.. మేము కాదు మా పార్టీ ఎక్కడా మిమ్మల్ని అగౌరవ పరచలేదు. మీ పార్టీకి చెందిన వాడు మాట్లాడితే దానికి గౌరవ సభా?’’ అని వ్యాఖ్యలు చేశారు.
* బండ రాయితో తలపై మోది హత్య
* నంది నగర్ కాలనీ శివారు చెరువు వద్ద లక్ పతి (36) అనే వ్యక్తి తలపై బండరాయితో కొట్టి హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
* కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
* బానోతు లక్ పతి శ్రీరామగిరి శివారు సున్నపురల్ల తండాకి చెందిన వ్యక్తిగా గుర్తింపు
* పాత కక్షలు మళ్ళీ చెలరేగాయని శ్రీరామగిరి గ్రామస్తుల్లో ఆందోళన
* తెలుగు అకాడమీ కేసు తరహాలో వెలుగులోకి మరో భారీ కుంభకోణం
* తెలంగాణ గిడ్డంగుల శాఖలో భారీగా నిధులు మాయం
* గిడ్డంగుల శాఖకు చెందిన 4 కోట్ల రూపాయల నిధులు గల్లంతు
* కార్వాన్ ఎస్బీఐలో గిడ్డంగుల శాఖకు చెందిన ఎఫ్ డీలు మాయం
* హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన గిడ్డంగుల శాఖ అధికారులు
శ్రీశైలం మండలంలో మొత్తం 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం శ్రీశైలంలోని అమ్మవారి ఆలయంలో ఒక అర్చకుడికి కరోన పాజిటీవ్ నిర్ధారణ అయినట్లు స్థానిక ప్రాధమిక వైద్యశాల వైద్యుడు తెలిపాడు. మండలంలోని మోత్తం కరోనా పాజటివ్ కేసులలో శ్రీశైలం 29, సున్నిపెంట 9, పాజిటివ్ కేసులుగా నమోదయ్యాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే దేవస్థానం క్షేత్రపరిధిలో కరోనా ఆంక్షలను కట్టుదిట్టం చేసినప్పటికీ కరోనా కేసులు పెరగడంపై ఉద్యోగస్తులో, స్థానికులలో, వ్యారస్తులలో భయాందోళన మొదలైంది. క్షేత్ర పరిధిలో ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, తరచూ స్వీయ రక్షణతో మెలగాలని, భౌతికదూరం పాటించాలని దేవస్థానం ఈవో లవన్న పీహెచ్‌సీ వైద్యుడు సోమశేఖర్ సూచించారు.
Background
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఇదయం వి.ఐ.పి విరామ సమయంలో ఎంపీ మోపీదేవి వెంకటరమణ, అన్నపూర్ణ ట్రస్టు వ్యవస్థాపకులు భగవన్ శ్రీ సత్య సాయి సద్గురు శ్రీ మధుసూదన్ సాయి, సినీ నటుడు శ్రీకాంత్ లు కుటుంబ సమేతంగా వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ మధుసూదన్ సాయి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని ప్రభుత్వ పాఠశాల్లో ఉదయం అల్పారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 50 వేల మంది పిల్లలకు ప్రతి రోజు అల్పాహారం అందించనున్నట్లు ఆయన తెలిపారు.
నటుడు కొంచాడ శ్రీనివాస్ మృతి
నటుడు కొంచాడ శ్రీనివాస్ బుధవారం మృతి చెందారు. ఆయన వయసు 47 ఏళ్లు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ పట్టణం ఆయన స్వగ్రామం. ప్రతి సంక్రాంతికి సొంత ఊరు వెళ్లడం ఆయనకు అలవాటు. ఈ ఏడాది సంక్రాంతికి కూడా సొంతూరు వెళ్లారు. అనారోగ్య సమస్యలతో అక్కడే తుదిశ్వాస విడిచారు.
కొన్నాళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు అనూహ్యంగా కింద పడటంతో ఆయనకు ఛాతి మీద బలమైన దెబ్బ తగిలిందని సమాచారం. అప్పుడు ఆస్పత్రికి తీసుకువెళ్లగా... గుండెల్లో సమస్య ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఆ సమస్య కారణంగా ఆయన మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సంక్రాంతి పండుగ కోసమని ఊరు వచ్చిన శ్రీనివాస్‌కు మరోసారి ఆరోగ్య సమస్య తలెత్తిందని, ఆస్పత్రికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిసింది. కాశీబుగ్గలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
కొంచాడ శ్రీనివాస్ రూపం, ముఖ్యంగా కళ్లు అతడిని అందరి మధ్య ప్రత్యేకంగా నిలిపాయి. ఆయనకు వేషాలు తెచ్చిపెట్టాయి. మెగాస్టార్ చిరంజీవి 'శంకర్ దాదా ఎంబీబీస్', యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఆది', 'ప్రేమ కావాలి' తదితర సినిమాలు చేశారు. సుమారు 40 సినిమాలు, పది సీరియళ్లలో ఆయన నటించారు.
కొంచాడ శ్రీనివాస్‌కు తల్లి విజయలక్ష్మి ఉన్నారు. తండ్రి ఐదు సంవత్సరాల క్రితం, తమ్ముడు పది సంవత్సరాల క్రితం మరణించారు. ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఇద్దరూ అత్తగారి ఇళ్లలో ఉన్నారు. శ్రీనివాస్ మృతి పట్ల చలన చిత్ర పరిశ్రమలో స్నేహితులు, సొంతూరి ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు తులానికి రూ.130 పెరిగింది. వెండి ధరలోనూ కిలోకు రూ.1,500 పెరుగుదల కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,100 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,200 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.1,500 పెరిగి రూ.67,300గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,300 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,100 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,300గా ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -