Breaking News Live: ఐసీయూలో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి.. !

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 2న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 02 Oct 2021 09:31 PM

Background

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్య కిరణాలు మళ్లీ ఈరోజు ఉదయం తాకాయి. ఉదయం ఏడు నిమిషాలు, శుక్రవారం రోజు 9 నిమిషాల పాటు సూర్య కిరణాలు మూలవిరాట్‌ను స్పృశించాయి. ఆ అద్భుత దృశ్యాలను చూసి భక్తులు పులకించిపోయారు. ...More

బద్వేలులో జనసేన పోటీ చేయడం లేదు : పవన్ 


కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ క్లారిటీ ఇచ్చారు. దివంగత ఎమ్మెల్యే భార్యకే టికెట్‌ ఇచ్చినందున జనసేన పోటీ చేయడం లేదని తెలిపారు. బద్వేలు జనసేన నేతలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఎన్నిక ఏకగ్రీవం చేసుకోవాలని వైసీపీకి సూచించారు. బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక ఈనెల 30న జరగనుంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది.