Breaking News Live: కేరళలో ఈనెల 17, 18 తేదీలలో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం రద్దు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 16న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 16 Oct 2021 09:29 PM
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం ‌ఈనెల 17, 18 తేదీలలో రద్దు

శబరిమల దర్శనాలపై కేరళ‌‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భక్తులకు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం ‌ఈనెల 17, 18 తేదీలలో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

హన్మకొండ జిల్లాలో రైల్వే గేట్ మెన్ పై యువకుడు దాడి.. మద్యం మత్తులో హల్‌చల్

హన్మకొండ జిల్లాలో రైల్వే గేట్ మెన్ పై దాడి జరిగింది. శాయంపేట Lc.No 61 వద్ద మద్యం మత్తులో ఉన్న యువకుడు గేట్ మెన్ రాజు పై ఓ యువకుడు దాడి చేసాడు. ట్రైన్ వస్తుంది అని గేట్ మెన్ చెప్పినా వినకుండా యువకులు గేట్ తెరిచే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన గేట్ మెన్‌పై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు.

తూర్పుగోదావరి జిల్లా కడియంలోని దుళ్ల సచివాలయంలో ఏఎన్ఎమ్‌కు పాముకాటు

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల సచివాలయం - 2 లోకి తాచుపాము ప్రవేశించడం కలకలం రేపింది. డ్యూటీలో ఉన్న ఏఎన్ఎమ్ ముత్యాలును సబ్ సెంటర్‌కి ప్రవేశించిన పాము కాటు వేసింది.  ఆమెను మండపేట హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తాచుపామును బంధించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

సోమవారం నాడు ఈడీ విచారణకు హాజరుకానున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

సుఖేశ్ చంద్రశేకర్ కేసులో సోమవారం నాడు ఈడీ ఎదుట బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాజరుకానుంది. ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో జాక్వెలిన్ నేడు హాజరు కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో హాజరుకాలేకపోయానని చెప్పింది. అక్టోబర్ 18న ఈడీ ఎదుట విచారణకు హాజరుకానుంది ఈ బాలీవుడ్ నటి. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఇదివరకే కొందర్ని అరెస్ట్ చేయగా, ఇటీవల మరో బాలీవుడ్ నటి నోరా ఫతేహికి సైతం నోటీసులు జారీ చేశారు. ఈడీ అధికారుల ఎదుట విచారణకు సైతం ఆమె హాజరైంది.

టీఆర్ఎస్ లోకి మోత్కుపల్లి నర్సింలు...!

టీఆర్ఎస్ లో మోత్కుపల్లి నర్సింలు చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18 (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో  సీఎం కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి టీఆర్ఎస్ చేరనున్నట్లు సమాచారం. 

జీజీహెచ్ లో అదృశ్యమైన శిశువు ఆచూకీ లభ్యం

గుంటూరు జీజీహెచ్‌లో అదృశ్యమైన నాలుగు రోజుల శిశువు ఆచూకీ దొరికింది. వార్డ్‌ బాయ్‌ హేమ వరుణుడు శిశువును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మరో మహిళతో కలిసి నిందితుడు చిన్నారిని తీసుకెళ్లినట్లు తేల్చారు. గుంటూరు నెహ్రునగర్‌ సమీపంలో శిశువును దాచిపెట్టినట్లు తెలిపారు. మోతీలాల్‌నగర్‌ ఒకటో లైన్‌లో శిశువును గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

పి.గన్నవరం ఇసుక ర్యాంపు వద్ద కొనుగోలుదారుల ఆందోళన 

తూర్పుగోదావరి జిల్లా ఇసుక ర్యాంపులో ఆందోళన నెలకొంది. పి.గన్నవరం ఇసుక ర్యాంపులో అక్రమ వసూళ్లు పాల్పడుతున్నారని కొనుగోలుదారులు అంటున్నారు. బాటకు, పడవకు రూ.500 చెల్లించాలంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బిల్లుకు కాకుండా అదనంగా రూ.500 చెల్లిస్తేనే ఇసుక ఇస్తామంటున్నారని స్థానికులు అన్నారు. అక్రమ వసూళ్లపై ట్రాక్టర్లు నిలిపివేసి ఆందోళన చేపట్టారు. అధికారుల పరివేక్షణ లేకపోవడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారని కొనుగోలుదారులు అంటున్నారు. 

పి.గన్నవరం ఇసుక ర్యాంపు వద్ద కొనుగోలుదారులు ఆందోళన 

తూర్పుగోదావరి జిల్లా ఇసుక ర్యాంపులో ఆందోళన నెలకొంది. పి.గన్నవరం ఇసుక ర్యాంపులో అక్రమ వసూళ్లు పాల్పడుతున్నారని కొనుగోలుదారులు అంటున్నారు. బాటకు, పడవకు రూ.500 చెల్లించాలంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బిల్లుకు కాకుండా అదనంగా రూ.500 చెల్లిస్తేనే ఇసుక ఇస్తామంటున్నారని స్థానికులు అన్నారు. అక్రమ వసూళ్లపై ట్రాక్టర్లు నిలిపివేసి ఆందోళన చేపట్టారు. అధికారుల పరివేక్షణ లేకపోవడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారని కొనుగోలుదారులు అంటున్నారు. 

మరికొద్ది గంటల్లో హైదరాబాద్ కు భారీ వర్ష సూచన!

మరికొద్ది గంటల్లో హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. ఎల్లో సూచిక జారీచేసింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశం మేఘావృతం అయ్యి ఉంటుందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశం ఉన్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ... కొత్త అధ్యక్షుడి ఎన్నికపై చర్చ!

దిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్ లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశమైంది. పార్టీ సంస్థాగత ఎన్నికలతో పాటు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు ప్రధానంగా ఈ భేటీలో చర్చకు రానున్నాయి. ముఖ్యంగా పంజాబ్‌ పరిణామాలపై కాంగ్రెస్‌ అసమ్మతి వర్గానికి చెందిన పలువురు అధిష్ఠానంపై బహిరంగంగా విమర్శలు చేసిన అంశాలు కూడా చర్చకు రానున్నాయి. 

టీం ఇండియా కొత్త కోచ్ గా రాహుల్ ద్రవిడ్ నియామకం..!

టీం ఇండియా కొత్త కోచ్ గా రాహుల్ ద్రవిడ్ నియమితులయ్యారు. ద్రవిడ్ 2023 వరకు కోచ్ గా వ్యవహరించనున్నారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత ద్రవిడ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 

గుంటూరు జీజీహెచ్ లో పసికందు అపహరణ

గుంటూరు జీజీహెచ్‌లో మూడురోజుల పసికందు అదృశ్యం కలకలం రేపుతోంది. శుక్రవారం రాత్రి సమయంలో మగ శిశువును ఎత్తుకెళ్లారు. అమ్మమ్మ, తాతయ్య వద్ద పడుకుని ఉండగా శిశువును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. శిశువు అదృశ్యంతో తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై జీజీహెచ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. 

రాయ్ పూర్ రైల్వే స్టేషన్ లో పేలుడు.... నలుగురికి సీఆర్పీఎఫ్ సిబ్బందికి గాయాలు

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. రాయ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఈ పేలుడు సంభవించింది. డిటోనేటర్ల బాక్స్ ఫ్లోర్ పై పడి పేలుడు సంభవించినట్లు రాయ్ పూర్ పోలీసులు భావిస్తున్నారు.





బ్రిటన్ లో ఎంపీ దారుణ హత్య

బ్రిటన్‌లో దారుణం ఘటన చోటుచేసుకుంది. యూకేకు చెందిన ఓ ఎంపీని దారుణంగా హత్య చేశారు. ఎంపీపై కత్తితో దాడి చేసిన నిందితుడు పలుమార్లు పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఇంగ్లాండ్ ఎసెక్స్‌లోని సౌత్‌ఎండ్‌ వెస్ట్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ డేవిడ్‌ అమెస్ (69) శుక్రవారం లీ- ఆన్- సీలోని ఓ చర్చిలో జరిగిన ఓ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం జరుగుతున్న క్రమంలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా అమెస్ పై కత్తితో దాడి చేశాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు డేవిడ్ అమెస్‌ను పొడిచాడు. 

దేవరగట్టులో చెలరేగిన హింస... వందల మందికి గాయాలు

కర్నూలు జిల్లాహొలగుంద మండలం దేవరగట్టులో కర్రల సమరంలో హింస చెలరేగింది. బన్ని ఉత్సవాల్లో ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకోవటం వల్ల  వందల మందికి తీవ్రగాయాలయ్యాయి. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది అధికారులు చేపట్టిన చర్యలు ఫలితం లేకపోయింది.

Background

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 16న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.