Breaking News Live Updates : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్: ఎమ్మెల్సీ కవిత
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 21 May 2022 07:21 PM
Background
భారత్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ(శనివారం) గ్రాముకి రూ.40 పెరిగింది. వెండి ధరలు 100 గ్రాములకు రూ.90 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల ధర 10 గ్రాములు రూ.50,950గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో...More
భారత్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ(శనివారం) గ్రాముకి రూ.40 పెరిగింది. వెండి ధరలు 100 గ్రాములకు రూ.90 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల ధర 10 గ్రాములు రూ.50,950గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవాళ(శనివారం) భారీగా పెరిగాయి. తాజాగా 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకి రూ.40 పెరిగి, హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో 10 గ్రాముల ధర రూ.46,700గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర గ్రాముకి రూ.44 పెరిగి ప్రస్తుతం రూ.50,950(10 గ్రాములు) ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర గ్రాముకి రూ.0.90 పెరిగి హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.65,900(ఒక కేజీ) అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.ప్రధాన నగరాల్లో బంగారం ధరలివేహైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల ధర రూ.50,950దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,860, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,210ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700,, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950వెండిధరలు: భారత మార్కెట్ లో వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి రూ.61,700 ఉండగా, చెన్నైలో రూ.65,900గా ఉంది. ముంబయిలో కిలో వెండి రూ.61,700 ఉండగా, కోల్‌కతాలో రూ.61,700, బెంగళూరులో కిలో వెండి రూ.65,900 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,900 ఉండగా, విజయవాడలో రూ.65,900 విశాఖలో రూ. 65,900 వద్ద కొనసాగుతోంది.రష్యా - ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంపసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. తాజాగా రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Guntur Crime: గుంటూరు పెదపలకలురులోని ఓ కాలేజ్ పై నుండి దూకిన యువతి
గుంటూరు పెదపలకలురులోని ఓ కాలేజ్ పై నుండి దూకిన యువతి.
యువతికి స్వల్ప గాయాలు, జి.జి.హెచ్ కి తరలింపు
డిగ్రీ పరీక్ష రాసేందుకు వచ్చిన యువతి.
గత కొంతకాలంగా యువకుడితో ప్రేమలో ఉన్న యువతి.
ప్రేమ వివాహాన్ని ఒప్పుకోరన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్న పోలీసులు