Breaking News Live Updates : ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ సీఎం కేసీఆర్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
అన్నని కాపాడబోయి తమ్ముడు.. నెల్లూరులో సముద్ర తీరంలో తీరని విషాదం..
వారిద్దరూ అన్నాదమ్ములు. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి కావడంతో.. సరదాగా కుటుంబ సభ్యులతో కలసి బీచ్ కి వెళ్లారు. నెల్లూరు జిల్లాలోని కొత్తకోడూరు బీచ్ కి వెళ్లి కుటుంబ సభ్యులతో కలసి మధ్యాహ్నం వరకు ఆనందంగా గడిపారు. అన్న ప్రణయ్ రెడ్డి సముద్రంలో కాస్త లోతు వరకు వెళ్లాడు. అతను మునిగిపోతుండటం చూసి తమ్ముడు ధనుంజయ్ రెడ్డి అన్నని కాపాడటానికి సముద్రంలోకి వెళ్లాడు. ఇలా ఇద్దరూ గల్లంతయ్యారు. చివరకు ఇద్దరూ దుర్మరణంపాలయ్యారు. మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి.
KCR Delhi Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ హస్తినకు పయనమయ్యారు. నేటి నుంచి 8 రోజులపాటు పలు రాష్ట్రాలలో కేసీఆర్ పర్యటించనున్నారు. పలు పార్టీల నేతలు, ఆర్థిక వేత్తలతో అక్కడ సమావేశమవుతారు. దేశ ఆర్థిక పరిస్థితులపైనా చర్చించనున్నారు.
Disha Encounter : దిశ నిందితుల ఎన్ కౌంటర్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో వాదనలు విన్న సుప్రీంకోర్టు కేసును హైకోర్టుకు బదిలీ చేసింది. తదుపరి విచారణ హైకోర్టులో జరుగుతుందని తెలిపింది. అయితే సిర్పూర్కర్ నివేదికను వాద, ప్రతివాదులకు అందించాలని సీజేఐ ధర్మాసనం ఆదేశించింది. నివేదికను సీల్డ్ కవర్ ఉంచాలన్న వాదనలు సుప్రీం తోసిపుచ్చింది. విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్.రమణ దేశంలో దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు. నివేదిక బయటపెడితే న్యాయవ్యవస్థపై ప్రభుత్వం చూపుతుందని న్యాయవాదులు వాదించారు. సిర్పూర్కర్ కమిషన్ నివేదికను గోప్యంగా ఉంచాలని సీజేఐను సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ కోరారు. అయితే నివేదికలో గోప్యం ఏంలేదని, దోషి ఎవరో తేలిపోయిందని సీజేఐ అన్నారు. నివేదిక ఎందుకు బయటపెట్టకూడదని జస్టిస్ హిమాన్ష్ శుక్లా ప్రశ్నించారు. నివేదికను మరోసారి పరిశీలించే ప్రసక్తే లేదని సీజేఐ అన్నారు.
Disha Encounter : దిశ నిందితుల ఎన్ కౌంటర్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేస్తుంది. విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్.రమణ దేశంలో దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు. నివేదిక బయటపెడితే న్యాయవ్యవస్థపై ప్రభుత్వం చూపుతుందని న్యాయవాదులు వాదించారు. సిర్పూర్కర్ కమిషన్ నివేదికను గోప్యంగా ఉంచాలని సీజేఐను సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ కోరారు. అయితే నివేదికలో గోప్యం ఏంలేదని, దోషి ఎవరో తేలిపోయిందని సీజేఐ అన్నారు. నివేదిక ఎందుకు బయటపెట్టకూడదని జస్టిస్ హిమాన్ష్ శుక్లా ప్రశ్నించారు. నివేదికను మరోసారి పరిశీలించే ప్రసక్తే లేదని సీజేఐ అన్నారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కేసు విచారణ చివరి దశకు వచ్చిందని, 10 నిమిషాలు సమయం ఇస్తామని సీజేఐ విచారణ సందర్భంగా అన్నారు.
MLC Car Dead Body : వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారులో మృతదేహం కలకలం సృష్టిస్తోంది. ఈ మృతదేహం ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రమణ్యంది అని గుర్తించారు. గురువారం ఉదయం ఎమ్మెల్సీ ఉదయ్ బాబు తనతో పాటు డ్రైవర్‌ను బయటకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రమాదం జరిగిందని డ్రైవర్ తమ్ముడికి ఉదయ్ బాబు సమాచారం ఇచ్చారు. అనంతరం డ్రైవర్ మృతదేహాన్ని బాధితుల ఇంటికి తీసుకొచ్చి కారులో వదిలేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
Guntur News : గుంటూరు జాతీయ రహదారిపై నాయుడు పేట వద్ద దారుణ ఘటన జరిగింది. చిత్తు కాగితాలు ఏరుకొని అమ్ముకొనే మహిళను అగంతకులు లారీతో ఢీ కొట్టారు. సంఘటన స్థలంలోనే మహిళ చనిపోయింది. లారీలో ప్రయాణం చేసి డ్రైవర్ కి డబ్బులు ఇవ్వలేదనే నెపంతోనే ఢీ కొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Guntur News : గుంటూరులో తొమ్మిదో తరగతి విద్యార్థిని అత్యాచారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలికకు మద్యం తాగించి దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి గుంటూరులో జరిగిన ఈ దారుణం గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో గుంటూరు నల్లపాడు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.
Background
బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాల విస్తరణ, ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Weather Updates : నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్నాయి. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరో వారంలో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి కూడా నైరుతి రుతుపవనాలు ముందుగానే రానున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జూన్ 5 నుంచి జూన్ 10లోపు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రాలు ప్రకటించాయి.
ఆంధ్రప్రదేశ్ లో
రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అనుకూల వాతావరణం కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం 3.1 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది నైరుతి దిశగా వంగి ఉంది. మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడు వరకు ఉత్తర దక్షిణ ద్రోణి మరఠ్వాడా కర్ణాటక మీదగా సముద్రమట్టాలనికి 1.5కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. దీని ఫలితంగా ఏపీలో రాగల రెండు రోజుల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని చోట్ల ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
తెలంగాణలో
తెలంగాణలో ఈ నెల 21వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం పలు జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళఖాతంలోని పలు ప్రాంతాలకు, మొత్తం అండమాన్ నికోబార్ దీవులకు, అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -