Andhra Pradesh Weather Updates | అమరావతి: అరేబియా సముద్రంలో మరో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది క్రమంగా పశ్చిమ దిశగా కదులుతోంది. మరికొన్ని గంటల్లో ఇది వాయుగుండంగా బలపడే అవకాశముంది. భారీ వర్షాలతో ఏపీ ప్రభుత్వం అలెర్ట్ అయింది. తీవ్ర వాయుగుండం ఒడిశాలో తీరం దాటినా, కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు. హోం మంత్రి అనిత తాజాగా ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. రెండు రోజులపాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈదురుగాలులు ప్రధాన సమస్యగా మారే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రాంతాల్లో, అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని సూచించారు. రోడ్లపై పడే చెట్లను తొలగించడం, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. వంశధార, నాగావళి నదుల వరద ప్రభావ ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే జిల్లాలు
1. శ్రీకాకుళం2. విజయనగరం3. పార్వతీపురం మన్యం4. విశాఖపట్నం5. అనకాపల్లి6. అల్లూరి సీతారామరాజు7. కాకినాడ8. తూర్పు గోదావరి9. అంబేడ్కర్ కోనసీమ
భారీ వర్షాలు పడే జిల్లాలు
1. ఏలూరు2. పశ్చిమ గోదావరి3. కృష్ణా4. ఎన్టీఆర్5. గుంటూరు6. బాపట్ల7. పల్నాడు8. ప్రకాశం
గొట్టా బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికశ్రీకాకుళం: వంశధార నదిలో వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం, గొట్టా బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ పరిణామంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే అప్రమత్తం అయ్యాయి. వంశధార నది కి ఇన్ ఫ్లో 80,844 క్యూసెక్కులు, అలాగే ఔట్ ఫ్లో కూడా 80,844 క్యూసెక్కులుగా ఉంది. గొట్టా బ్యారేజ్ వద్ద నీటి స్థాయి ప్రమాదకరంగా పెరుగుతున్నట్లు అధికారులు హెచ్చరించారు. వర్షాలు ఇంకా ఎక్కువగా కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలను అధికారులు సూచించారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ (Disaster Management Authority) సూచించింది.
నంద్యాల జిల్లాలో శ్రీశైలం డ్యాంకు తగ్గుతున్న వరద జలాశయం 10 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేత
జూరాల జలాశయం..2,76,056 క్యూసెక్కులు
సుంకేసుల..17,784 క్యూసెక్కులు
హంద్రీ.. 2,000 క్యూసెక్కులు
ఇన్ ఫ్లో : 2,95,840 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 3,41,374 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 883.90 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 209.1579 టీఎంసీలు
కుడి గట్టు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.