AP Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత తగ్గింది. గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ ప్రజలను వణికించిన కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఉత్తర దిశ నుంచి వీచే చల్లని గాలులు ఆగిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గాడిన పడుతున్నాయి. తాజాగా ఆగ్నేశ దిశ, ఉత్తర దిశల నుంచి గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. వీటి ప్రభావం అంతంతమాత్రంగానే ఉండటంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
రాష్ట్రంలో వాతావరణం గత కొద్ది రోజుల నుంచి పొడిగా ఉంది. ఉత్తర, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న చల్ల గాలుల ప్రభావంతో తెలంగాణ వాతావరణంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అంచనా వేశారు. నేటి నుంచి రెండు రోజులపాటు రాష్ట్రంలో పలు చోట్ల అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, ములుగు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
ఏపీ వెదర్ అప్‌డేట్స్..
తూర్పు వైపు, ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి నుంచి రెండు రోజులపాటు పలు ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు పుంజుకున్నాయి. ఆంధ్రా కాశ్మీర్‌గా చెప్పుకునే లంబసింగి, పాడేరు పక్కన ఉన్న వంజాంగి, పెదబాయలులోనూ చలి సాధారణంగా ఉంది. ఏపీలోని కేంద్రాల్లో జంగమేశ్వరపురంలో అత్యల్పంగా 16.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
దక్షిణ కోస్తాంద్రలో నేడు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి రెండు రోజులపాటు తేలికపాటి జల్లులు కురవనున్నాయి. నందిగామలో 17.4 డిగ్రీలు, తునిలో 20 డిగ్రీలు, కళింగపట్నంలో 18.1 డిగ్రీలు, విశాఖపట్నంలో 21.6 డిగ్రీలు, కాకినాడలో 20.9 డిగ్రీలు, విజయవాడలో 20 డిగ్రీలు, మచిలీపట్నంలో 21.3 డిగ్రీలు, బాపట్లలో 17.3 డిగ్రీలు, అమరావతిలో 18.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసమీలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కడపలో 21.2 డిగ్రీలు, తిరుపతిలో 19.4 డిగ్రీలు, కర్నూలులో 17.5 డిగ్రీలు, అనంతపురంలో 16.5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్! రూ.100 తగ్గిన బంగారం ధర.. వెండి మాత్రం పైపైకి.. తాజా రేట్లు ఇవీ..
Also Read: ఇంకోసారి అలా మాట్లాడితే ఇంటికొచ్చి కొడతా, 300 ముక్కలుగా నరుకుతా.. బోధన్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు