Andhra Pradesh High Court: తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి తాడిపత్రికి వెళ్లలేకపోతున్నారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్ి.  హైకోర్టు సింగిల్ జడ్జి తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి అనుమతి ఇచ్చింది.   సోమవారం ఉదయం పది నుంచి పదకొండు గంటల మధ్య ఆయన తాడిపత్రికి వెళ్లడానికి పోలీసులు భద్రత కల్పించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశించింది.  కానీ తాడిపత్రిలో  జేసీ ప్రభాకర్ రెడ్డి భారీ శివుని విగ్రహం ఏర్పాటు చేసి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సమయంలో తాడిపత్రిలోకి వెళ్తే శాంతిభద్రతల సమస్యలు వస్తాయని పెద్దారెడ్డిని మార్గమధ్యంలోనే ఆపేశారు.  

2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో తాడిపత్రిలో చెలరేగిన హింసాత్మక ఘటనల  కారణంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని  చెబుతున్నారు. కేతిరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, 2025 మే 2న హైకోర్టు ఆయనకు తాడిపత్రి వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. షరతులలో ఐదు వాహనాలతో మాత్రమే వెళ్లాలని, తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ లో అనంతపురం ఎస్పీ పిటిషన్ దాఖలు చేశారు. తిరెడ్డి తాడిపత్రిలోకి ప్రవేశిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, జేసీ ప్రభాకర్ రెడ్డి  అనుచరులతో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పోలీసులు  వాదించారు. 

అయితే తనకు హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని ఆయినా  పోలీసులు ధిక్కరిస్తున్నారని, జేసీ ప్రభాకర్ రెడ్డి ఒత్తిడితో పోలీసులు తనను అడ్డుకుంటున్నారని కేతిరెడ్డి ఆరోపించారు. సోమవారం  నారాయణరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గతంలో ఆయన ఓ సారి పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా నేరుగా తాడిపత్రికి వచ్చారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఆయనను హుటాహుటిన అక్కడి నుంచి తరలించారు. 

తాడిపత్రిలో YSRCP నేత కేతిరెడ్డి ,  టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య రాజకీయ శత్రుత్వం ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించబోమని, ఆయన గతంలో చేసిన దౌర్జన్యాలకు ప్రజలకు సమాధానం చెప్పాలని  డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో తాడిపత్రిలో  కేతిరెడ్డి ఇంటిని అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ మున్సిపల్ అధికారులు కొలతలు తీసుకున్నారు. ఎప్పుడైనా కూల్చివేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.  

తాడిపత్రి మొదటి నుంచి సమస్యాత్మక నియోజకవర్గం. ఫ్యాక్షన్ ప్రభావిత నియోజకవర్గంలో  జేసీ, కేతిరెడ్డి వర్గాల మధ్య  గొడవలు ఉన్నాయి. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్న సూరీడును ప్రత్యర్థులు చంపేసిన తర్వాత అందరూ రాజీ చేసుకున్నారు. ఆ తర్వాత పరిస్తితి సద్దుమణిగింది. ఆ సూరీడు కుమారుడే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. అయితే పెద్దారెడ్డి గత ఎన్నికల్లో తాడిపత్రి నుంచి పోటీ చేయడంతో మళ్లీ జేసీ,కేతిరెడ్డి వర్గాల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఓ దశలో .. తాను మళ్లీ గెలిస్తే..ఫ్యాక్షన్ ప్రారంభిస్తానని కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో ఓ సారి జేసీ ఇంట్లో లేనప్పుడు ఆయన ఇంటికి వెళ్లి జేసీ కూర్చునే కుర్చీలో కూర్చున్నారు పెద్దారెడ్డి. దాంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలోకి రానివ్వబోమని అంటున్నారు.