IAS Transfer in Andhra Pradesh | అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇదివరకే పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులను చంద్రబాబు ప్రభుత్వం బదిలీ చేసింది. ఇటీవల 19 మంది ఐఏఎస్ లను బదిలీ చేసి ఏపీ ప్రభుత్వం తాజాగా మరో 18 మంది ఐఏఎస్ లను ట్రాన్స్ ఫర్ చేసింది. విశాఖ కలెక్టర్ మల్లికార్జున్, గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిలను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ శనివారం (జూన్ 22న) రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.


ఏపీలో 18 మంది ఐఏఎస్ ల బదిలీ    
- విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున్ ను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
- విశాఖపట్నం జేసీకి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు
- గుంటూరు కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం
- గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్‌. నాగలక్ష్మి
- పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా సి. నాగరాణి
- చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా సుమిత్‌ కుమార్‌
- తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా పి. ప్రశాంతి
- కాకినాడ జిల్లా కలెక్టర్‌గా సగలి షణ్మోహన్‌
- ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె.వెట్రిసెల్వి
- విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బి.ఆర్‌. అంబేడ్కర్‌
- అల్లూరి జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత బదిలీ
- అల్లూరి జిల్లా కలెక్టర్‌గా దినేష్‌ కుమార్‌ నియామకం
- ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా  తమీమ్‌ అన్సారియా
- ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌గా జి.సృజన
- కర్నూలు జిల్లా కలెక్టర్‌గా రంజిత్‌ బాషా
- బాపట్ల కలెక్టర్‌గా ఆ జిల్లా జేసీకి అడిషనల్ ఛార్జ్