Free Summer Camps In Andhra Pradesh: సెలవులు వచ్చాయంటేనే తల్లిదండ్రుల్లో భయం మొదలవుతుంది. పిల్లలు సెల్‌ఫోన్‌లు, టీవీలకు అతుక్కుపోతారని కంగారుపడిపోతారు. అందులోనూ వేసవి సెలవులు అంటే చాలా మరింత టెన్షన్ మొదలవుతుంది. ఒకట్రెండు కాదు నెలల పాటు ఇంట్లో ఇదే గోల. అందుకే దీన్ని మీ పిల్లల స్కిల్ పెంచేందుకు సరికొత్త ఆలోచన చేసింది. ప్రత్యేకంగా మీ సమీపంలోనే వేసవి శిబిరాలు ఏర్పాటు చేసింది. ఇవాళ్టి నుంచే వాటిలో శిక్షణ ప్రారంభమవుతుంది. మీ పిల్లల్ని పంపిస్తే ఆట పాటలతో ఎంజాయ్ చేసి వస్తారు.
నార్మల్ రోజుల్లో చదువు, ఇతర వ్యాపకాలతో పిల్లలు ఆటలకు దూరమవుతున్నారు. అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా వేసవి శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. శాప్, గ్రంథాయల శాఖ ఆధ్వర్యంలో వివిధ క్రీడలు, ఇతర విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. వాటిని మే 1 నుంచి ప్రారంభమయ్యాయి. ఎక్కువ మందికి అందుబాటులో ఈ శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. జూన్ ఆరో తేదీ వరకు అన్ని జిల్లాల్లో ఈ వేసవి శిక్షణాశిబిరాలను కంటిన్యూ చేయనుంది ప్రభుత్వం.
ప్రభుత్వ శిక్షణ శిబిరాలతోపాటు వివిధ ప్రైవేటు వ్యక్తులు, ఇతర స్వచ్చంద సంస్థలు ఈ వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు సెల్‌ఫోన్లు, టీవీలకు పరిమితమైపోకుండా చూస్తున్నారు. ఆరోగ్యాలు పాడుచేసుకోవడం కంటే... శిక్షణ శిబిరాలకు వెళ్లి ఆడుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జీవీఎంసీ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. కోట్ల రూపాయలు వెచ్చించి ఈ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో 33 రాకాల క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న కోచ్‌లను ఎంపిక చేసి పిల్లలకు ఇష్టమైన క్రీడలో శిక్షణ ఇస్తారు.
వైజాగ్‌లో ఎక్కడ శిక్షణ ఇస్తారువిశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, గాజువాక వికాస్‌నగర్ స్టేడియం, ఎంవీపీకాలనీ రాజీవ్‌గాంధీ జిమ్నాజియం ఇండోర్ స్టేడియం, గాజువాక ఓపెన్ ఆడిటోరియం, కోరమండల్ గేటు ఎదురుగా ఉన్న గ్రౌండ్, అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం, భీమునిపట్నం మున్సిలప్ గ్రౌండ్, భీమిలి ఇండోర్ స్టేడియం, ఏయూ గ్రౌండ్, మధురవాడ స్కూల్ గ్రౌండ్, ఇలా అందుబాటులో ఉన్న మైదానాల్‌లో పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారు.
శిక్షణ ఇచ్చే అంశాలుక్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్, కరాటే, కుంగ్‌ఫూ, బాక్సింగ్, చెస్, టెన్నీస్ ఇలా 33క్రీడల్లో శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. ఉచితంగా టీ షర్ట్, కోడిగుడ్డు, ఎనర్జీ డ్రింక్, క్రీడాపరికరాలు అందజేస్తారు.
వైజాగ్‌లోని పెదగంట్యాడలో గ్రంథాయాల అధికారులు చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. కథలు చెబుతున్నారు. యోగా చేయిస్తున్నారు. గ్రంథాయల అధికారు సూచన మేరకు గాజువాక, పశ్చిమ నియోజకవర్గాల్లో ఈ వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ శిబిరాలు ఏప్రిల్ 28న ప్రారంభమయ్యాయి. జూన్ ఆరో తేదీ వరకు కొనసాగుతాయి. రోజూ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు వివిధ విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఆటలు పాటలు, పుస్తకాలు చదవడం, కథలు చెప్పడం, డ్రాయింగ్ పోటీలు, స్పోకెన్ ఇంగ్లిష్ క్లాస్‌లు ఇలా చాలా అంశాల్లో తర్ఫీదు ఇస్తున్నారు.
వైజాగ్‌లోనే బీచ్‌రోడ్డు గాయత్రి విద్యాపరిషత్ ఎంఎల్‌బీటీ పాఠశాల కూడా బాలల విజ్ఞాన వికాస శిబిరం ఏర్పాటు చేసింది. భారతీ. సంస్కృతి సంప్రదాయాలపై, వ్యక్తిత్వ విలువలపై రోజూ 8.30 నుంచి శిక్షణ ఇస్తారు. విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత, భాగవతం, పద్యాలు, చిత్రలేఖనం, డ్యాన్స్, మ్యూజిక్, తెలుగు భాష చదవడం, రాయడం నేర్పిస్తారు.
తిరుపతిలో శిక్షణ శిబిరాలు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 14 క్రీడాంశాల్లో 48 శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో కేంద్రంలో 25 మంది చిన్నారులకు ట్రైనింగ్ ఇస్తారు. క్రీడా పరికరాల కోసం రూ. 5,500, కోచ్‌కు రూ.1,500 ఇస్తారు. వాలీబాల్- సంగన పల్లె జడ్పీ ఉన్నత పాఠశాల, పుంగనూరు జడ్పీ ఉన్నత పాఠశాల, రొంపిచెర్ల జడ్పీ ఉన్నత పాఠశాల, కార్వేటినగరం జడ్పీ ఉన్నత పాఠశాల, యాదమరి క్రీడా మైదానం, కుప్పం జడ్పీ ఉన్నత పాఠశాల, గరిగచిన్నేపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల, పీహెచ్వాడ జడ్పీ ఉన్నత పాఠశాల చిత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గంగవరం , ప్రభుత్వ ఉన్నత పాఠశాల నగరి క్రీడా వికాస కేంద్రం, 189 కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల , బంగారుపాళ్యం ప్రభుత్వ ఉన్నత పాఠ శాల
తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఉన్న మిత్రబందు పిరమిడ్ స్పిర్చువల్ సొసైటీ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు, యువకులు చిన్నారలకు చాలా అంశాల్లో శిక్షణ ఇస్తారు. జ్ఞాపకశక్తి పెంచేందుకు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేందుకు తర్ఫీదు ఇస్తారు. సంగీతం, చెస్, డ్రాయింగ్, రైటింగ్, అబాకస్, ధ్యానం, యోగాలో శిక్షణ ఇస్తారు. ఉదయం 8 గంటల నుంచి పది గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
శ్రీకాళం జిల్లాలో 50 శిబిరాలు సాప్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో 50 శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. 8 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు పదికిపైగా క్రీడల్లో శిక్షణ ఇస్తారు. శ్రీకాకుళం జిల్లాలో శిక్షణ ఇచ్చే క్రీడా మైదనాలు ఇవే టీపీఎం పాఠశాల, పీఎస్‌ఎస్‌ఎంహెచ్, ఆర్ట్స్ కాలేజీ, కేఆర్ స్టేడియం, టౌన్‌హాల్, బలగ, ఎన్టీఆర్ ఎంహెచ్ మైదానం, బాలభాను విద్యాలయంలో శిబిరాలు ఏర్పాటు చేశారు. దీనికి కోచ్‌లను కూడా ఏర్పాటు చేసి వారి ఫోన్ నెంబర్లు ప్రకటించారు. పలాస మండలం రంగోయి జడ్పీ స్కూల్‌లో ఉద్దాన ప్రాంత విద్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వేసవి శిబిరం నిర్వహిస్తున్నారు.
కర్నూలు జిల్లాలో శిక్షణ శిబిరాలు కర్నూలు జిల్లాలో శాప్ ఆధ్వర్యంలో ప్రత్యేక వేసవి శిబిరం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఉదయం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల వరకు శిక్షణ ఇస్తారు. కర్నూలులో రైఫిల్ షూటింగ్, విలువిద్య, అథ్లెటిక్స్, బాక్సింగ్, బాల్‌బ్యాడ్మింటన్‌లో ట్రైనింగ్ ఇస్తారు. ఒక్కో బ్యాచ్‌లో 40 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. కర్నూలులో శిబిరాలు జరిగే ప్రాంతాలు ఇవే- అశోక్ నగర్, అమ్మ ఆసుపత్రిలైన్, డీఎస్‌ఏ స్టేడియం, ఎస్టీబీఏ స్టేడియం, బి.క్యాంపు మైదానం, మారుతి నగర్, జడ్పీ పాఠశాల, గొందిరృపర్ల.
గోదావరి జిల్లాల్లో శిక్షణ శిబిరాలు గోదావరి జిల్లాల్లో కూడా 15 క్రీడాంశాలపై శాప్ అధికారులు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏ క్రీడకు శిక్షణ ఇస్తారంటే... అథ్లెటిక్స్- రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ, జీబీ హెచ్‌ఎస్ నిడదవోలు, బాల్‌బ్యాడ్మింటన్- అనపర్తిలోని బ్రాహ్మణగూడెం జడ్పీ ఉన్నత పాఠశాల బాస్కెట్‌బాల్ - ఆర్ట్స్ కాలేజీ, ఎస్‌కేవీటీ కాలేజ్, ఏపీ పేపరు మిల్లు గ్రౌండ్, రాజవోలు జడ్పీ ఉన్నత పాఠశాల, రాజమండ్రి డీఎంహెచ్ స్కూల్, ధ్వవళేశ్వరం, అనపర్తి, దేవరపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలు, బాక్సింగ్- ఎస్‌కేవీటీ డిగ్రీకాలేజ్, జీఎంఆర్ పాలిటెక్నిక్, ఏకేసీ రాజమండ్రి, అనపర్తి శ్రీచైతన్య స్కూల్, చెస్- దూబచెర్ల సంఘమిత్ర విద్యాలయం క్రికెట్- దేవరపల్లి ఏఎస్‌ఎన్ జడ్పీ హైస్కూలు, నిడదవోలు ప్రభుత్వం బాలుర పాఠశాల, అనపర్తి జడ్పీ హైస్కూల్, ఫుట్‌బాల్- కడియం జెడ్పీహెచ్ స్కూల్, ఎస్‌కేవీటీ డిగ్రీ కాలేజ్ దేవరపల్లి ఎస్‌ఎన్ జడ్పీ హైస్కూల్, ఎపిక్ ఫుట్‌బాల్ క్లబ్ రాజమండ్రి, ఆర్ట్స్ కాలేజ్హ్యాండ్‌బాల్ - ఎస్‌కేవీటీ కాలేజీ, ఊలపల్లి జడ్పీ హెచ్ స్కూల్, జూడో- కొవ్వూరు అచీవర్స్ మార్టిలాల్ ఆర్ట్స్ అకాడమీ, కడియం హైస్కూల్, అనపర్తి శ్రీచైతన్య స్కూల్ కరాటే- రాజమండ్రి గౌతమి ఘర్, కొవ్వూరు అచీవర్స్ మార్టిలాల్ ఆర్ట్స్ అకాటమీ, రాజమండ్రి చున్నీలాల్ జాజూ మున్సిపల్ స్కూల్ కబడ్డీ - ఆర్ట్స్ కాలేజీ, లాలాచెరువు హైస్కూల్, డీఎంహెచ్ రాజమండ్రితైక్వాండో- కోలమూరు, రాజమండ్రి మున్సిపల్ స్కూల్, సీతానగరం హైస్కూల్వాలీబాల్ - అనపర్తి హైస్కూల్, ఆర్ట్స్ కాలేజీ, కొవ్వూరు ఎన్టీఆర్ కేవీకే స్టేడియం, రాజవోలు జడ్పీ స్కూల్, దూబచెర్ల సంఘమిత్ర విద్యాలయంవెయిట్‌లిఫ్టింగ్- భారతీయవ్యాయమ కళాశాల తుమ్మలోవ యోగ- దూబచర్ల సంఘమిత్ర విద్యాలయం, రాజమండ్రి శ్రీనివాస రామానుజం మున్సిపల్ స్కూల్, కొత్తపేట శ్రీచైతన్య స్కూల్, ధవళేశ్వరం జెడ్పీ స్కూల్,