Akhanda Purnahuthi Program: విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తున్న శ్రీ లక్ష్మీ మాహాయజ్ఞం ముగింపు కార్యక్రమం అయిన అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన అక్కడికి చేరుకోగానే వేద పండితులు ఘన స్వాగతం పలికారు. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవదాశ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం ముగింపు దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలని సీఎం వైఎస్ జగన్ ఈ మహా యజ్ఞాన్ని ప్రారంభించారు. ముందుగా వేద పండితుల మత్రోచ్ఛారణతో కూడిన సంకల్పం తీసుకొని ఆరు రోజుల క్రితం ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. అయితే ఈ మహాయజ్ఞం బుధవారం రోజు వేద పండితులు నిర్ణయించిన సుముహూర్తంలో తిరిగి సీఎం జగన్ చేతుల మీదుగానే అఖండ పూర్ణాహుతి కార్యక్రమంతో ముగియనుంది.
ఆరురోజుల పాటు సాగుతున్న శ్రీలక్ష్మీ మహా యాగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమం కోసం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో చండీరుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహా యాగం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మే 12వ తేదీ నుంచి మే 17వ తేదీ వరకు ఆరు రోజుల పాటు కార్యక్రమం సాగుతుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ మహా యాగాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రం సశ్యశ్యామలంగా ఉండేలా, ప్రజలు సౌభాగ్యంతో జీవించేలా రాష్ట్ర సర్వతోముఖాభివృద్దే లక్ష్యంగా ఎంతో పవిత్రమైన ఈ యజ్ణాన్ని ప్రభుత్వం చేపడుతోందని దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ మహా క్రతువు మే 12వ తేదీ ఉ.5గం.లకు బ్రహ్మ ముహూర్త కాలంలో ప్రారంభం అయింది. ప్రధానంగా నాలుగు యాగశాలలు ఉండగా.. ఒక్కో యాగ శాలలో 108 కలశాలతో యాగం జరుగుతుంది. ఈ యాగ కార్యక్రమాల్లో 520 మందికిపైగా రుత్వికులు పాల్గొంటున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు యాగ కార్యక్రమాలు సాగుతున్నాయి. వీటితోపాటు ప్రతి రోజు అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
Also Read: ఐదు కోట్ల ఖర్చుతో ఏపీ సంక్షేమం కోసం శ్రీలక్ష్మీ మహా యాగం
యాగానికి ఐదు కోట్లు ఖర్చు...
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖ శర్మ వంటి ప్రవచనకర్తలు కూడా పాల్గొని ప్రజలకు వివిధ ప్రవచనాలు ద్వారా హిందూ ధార్మిక పరిరక్షణ తదితర అంశాలను తెలియజేస్తున్నారు. స్వరూపానంద స్వామి, చినజీయర్ స్వామి, కుర్తాళ సిద్ధేశ్వర, మంత్రాలయ, జగద్గురు పండితారాధ్య తదితర పీఠాధిపతులు కూడా పాల్గొంటున్నారు. యాగశాలల లోపలికి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. మే 17 తేదీన చివరి అంకంలో భాగంగా పూర్ణహుతి ఉంటుంది. ఈ కార్యక్రమం ప్రారంభించేందుకే నేడు సీఎం జగన్.. ఇక్కడకు వచ్చారు. దాదాపు ఈ యాగం నిర్వహణకు రూ.5 కోట్లు వ్యయం అవుతుందట. ఈ మహా యజ్ఞాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల కృషి చేస్తున్నాయి. మొత్తం దీని కోసం 13 కమిటీలు పని చేస్తున్నాయి.
Also Read: శ్రీలక్ష్మీ మహా యజ్ఞంలో పాల్గొన్న సీం జగన్, పంచెకట్టులో మెరిసన సీఎం