CM Jagan :   పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.   మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడారు.  ఎలాంటి అనుమతులు లేకుండా గత పాలకులు ప్రాజెక్టు చేపట్టారని..  ప్రస్తుతం అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు.  ఏదైనా పని చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలన్నారు.  


ఈ ప్రాజెక్టును ఎర్రగొండపాలెం వరకూ తీసుకెళ్తాం !


ఈ ప్రాజెక్టును దశలవారిగా మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు తీసుకెళ్తామని సీఎం జగన్ తెలిపారు.  ఈ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు అందింబోతున్నామన్నారు.  పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నామని భరోసా ఇచ్చారు.   ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు మహిళా సాధికారితకు కృషి చేశాం. రూ.2 లక్షల 40 వేల కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయి. డీబీటీ నాన్‌డీబీటీ ద్వారా రూ.4 లక్షల 10వేల కోట్లు అందించాం. కోవిడ్‌ సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించామని ప్రజలకు గుర్తు చేశారు. 


చంద్రబాబుకు సంక్షేమం పట్టదు ! 


ఎంతటి కష్టకాలంలోనూ అభివృద్ధి సంక్షేమాన్ని ఆపలేదని..  చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదని ఆరోపించారు.  చంద్రబాబు పాలనలో మోసాలు, వెన్నుపోటు, అబద్ధాలేనన్నారు.   14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటైనా మంచి కార్యక్రమం చేపట్టలేదన్నారు.  కుప్పం ప్రజలకే నీళ్లు ఇవ్వని చంద్రబాబు ఇతర ప్రాంతాలను బాగు చేస్తారా? కన్నతల్లికి అన్నం పెట్టనివాడు పిన్నతల్లికి బంగారు గాజులు కొనిస్తాడా?’’ అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందన.ి.  కేజీ బంగారం, బెంజ్‌ కార్లు ఇస్తామని చంద్రబాబు ఆఫర్లతో వస్తాడని జోస్యం చెప్పారు. 


చంద్రబాబు విజన్ - అప్పటి వరకూ  బతికి ఉండేదెవరు ? 


 సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ప్రజలకు వెన్నుపోటు పొడవకుండా ఉంటారా అని జగన్ ప్రశ్నించారు.  చంద్రబాబు మారానని చెబితే ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు.  స్సీల్లో ఎవరైనా పుట్టానుకుంటారా అన్నది చంద్రబాబే బీసీల తోకలు కట్‌ చేస్తానని అహంకారంగా మాట్లాడిందీ చంద్రబాబేనన్నారు.  చంద్రబాబు ఇప్పటి గురించి చెప్పడు కానీ.. రాబోయే 50 ఏళ్లలో ఏం చేస్తాడో చెబుతాడు..  అప్పటి వరకు బ్రతికి ఉండేది ఎవరు అని ప్రశ్నించారు.    రాష్ట్రంలోని గ్రామగ్రామాన సచివాలయ వాలంటీర్‌ వ్యవస్థ తీసుకొచ్చాం. పల్నాడును జిల్లా చేసిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిదేనన్నారు.  చంద్రబాబు మానవత్వంలేని మనిషి. చంద్రబాబు తన మాటలు ఎవరూ నమ్మరని.. మరో నలుగురిని వెంటబెట్టుకుని వస్తున్నారని ఆరోపించారు. 


మిమ్మల్నే నమ్ముకున్నాను !


చంద్రబాబులాగా పొత్తులు పెట్టుకోవడం తనకు తెలియదని.. తాను  మిమ్మల్నే నమ్ముకున్నానని సీఎం జగన్ ప్రజల్ని ఉద్దేశించి అన్నారు.  చంద్రబాబు పేదలకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదన్నారు. తము  రాష్ట్రంలో 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు ఇస్తున్నామని.. మీకు మంచి జరిగితేనే ఓటేయండని చెప్పే ధైర్యం మాదన్నారు.  అన్ని వర్గాలకు మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ఉన్నామన్నారు.