Andhra 14 districts SPs transfer: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం పెద్ద ఎత్తున పోలీసు అధికారుల బదిలీలు చేసింది. మొత్తం 14 మంది జిల్లా సూపరింటెండెంట్ల ఆఫ్ పోలీస్ బదిలీలు జరిగాయి. ఇందులో ఏడుగుర్ని ఇతర జిల్లాలకు ఎస్పీలుగా నియమించారు. మరో ఏడు జిల్లాలకు కొత్త వారిని ఎస్పీలుగా నియమించారు. పన్నెండు జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న వారినే ఎస్పీలుగా కొనసాగించాలని నిర్ణయించారు.
కొత్త ఎస్పీలు వీళ్లే
గుంటూరు ఎస్పీగా వకుల్ జిందాల్అన్నమయ్య జిల్లాకు ధీరజ్ కురుగలికృష్ణా జిల్లాకు విద్యాసాగర్ నాయుడుపల్నాడుకు డి.కృష్ణారావునెల్లూరు ఎస్పీగా అజితా వేజెండ్లవిజయనగరం జిల్లా ఎస్పీగా దామోదర్సత్యసాయి జిల్లా ఎస్పీగా సతీష్ కుమార్తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడుకడప జిల్లా ఎస్పీగా నచికేత్ప్రకాశం జిల్లా ఎస్పీగా హర్షవర్థన్ రాజుచిత్తూరు జిల్లా ఎస్పీగా తుషాత్ దూడి కోనసీమ ఎస్పీగా రాహుల్ మీనానంద్యాల ఎస్పీగా సునీల్ షెరాన్
తిరుపతి ఎస్పీగా మళ్లీ సుబ్బారాయుడును నియమించారు. ఆయన గతంలో కూడా తిరుపతి ఎస్పీగా ఉండేవారు. తొక్కిసలాట ఘటన తర్వాత బదిలీ చేశారు. జ్యూడిషియల్ విచారణలో ఆయన ప్రమేయం లేదని తేలడంతో.. మళ్లీ పోస్టింగ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. లిక్కర్ సిట్ లోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.