Unidentified Man Threw Slipper To Cm jagan Bus: సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' (Memantha Siddam) బస్సు యాత్రలో కలకలం రేగింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి  సీఎం బస్సుపైకి చెప్పు విసరడం సంచలనంగా మారింది. శనివారం కర్నూలు జిల్లా పర్యటన ముగించుకున్న అనంతరం సీఎం జగన్ అనంతపురం జిల్లాకు చేరుకున్నారు. గుత్తి (Gutti) పట్టణంలోని బస్టాండ్ సమీపంలో రోడ్ షో నిర్వహించారు. ఇదే సమయంలో ప్రజలకు అభివాదం చేస్తుండగా.. సీఎం బస్సుపైకి ఓ గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. అయితే, అది దూరంగా పడిపోయింది. ఈ ఘటనతో వైసీపీ నేతలు, అభిమానులు షాకయ్యారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, దీనికి సంబంధించిన వీడియోను టీడీపీ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. సీఎం జగన్ పై సెటైరికల్ గా పోస్టు పెట్టింది.



Also Read: పిఠాపురంలో పవన్ విజయభేరి బహిరంగ సభ, భారీగా తరలివస్తున్న కూటమి శ్రేణులు