Satyavardhan kidnap case | విజయవాడ: విజయవాడలో సంచలనం సృష్టించిన దళిత యువకుడు సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న కీలక నిందితుడు (ఏ2) కొమ్మా కొట్లు విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్‌లో సోమవారం లొంగిపోయాడు. ఈ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (ఏ1) కాగా, కొమ్మా కొట్లు (ఏ2)గా ఉన్నాడు. కేసులో మరికొందరు నిందితులు ఉన్నారు.

Continues below advertisement

కేసు వివరాలు..వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా దళిత యువకుడు సత్యవర్థన్‌ ఉన్నాడు. అతడ్ని కిడ్నాప్ చేసి, మొదట హైదరాబాద్‌కు తరలించి, తరువాత తిరిగి విజయవాడకు తీసుకురావడంలో ఏ2 కొమ్మా కొట్లు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఈ కేసును ఉపసంహరించుకోవాలని వల్లభనేని వంశీ అనుచరులు సత్యవర్థన్‌పై తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. అందుకు అతడు నిరాకరించడంతో, చివరకు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు, తేలప్రోలు రాము, వజ్రకుమార్, ఇటీవల కోర్టులో లొంగిపోయారు. మరో కీలక నిందితుడు ఎర్రంశెట్టి రామాంజనేయులును విజయవాడ పటమట పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇటీవల కొమ్మా కొట్లుతో సహా మరికొందరు నిందితులు అజ్ఞాతంలో ఉండగా, వారిపై ఇటీవల నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ క్రమంలో కొమ్మా కొట్లు పటమట పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

Continues below advertisement

Also Read: Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు ప్రదానం

కిడ్నాప్ కేసుల చట్టాలుభారతీయ శిక్షా స్మృతి (IPC) ప్రకారం, కిడ్నాప్ (Section 363) ,అపహరణ (Section 360/361) తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. ఒక వ్యక్తిని బలవంతంగా అక్రమంగా నిర్బంధించినా, లేదా చట్టవిరుద్ధంగా తరలించినా కిడ్నాప్ నేరం కిందకి వస్తుంది. రాజకీయ ఒత్తిళ్ల కోసం లేదా కేసు ఉపసంహరణ కోసం బెదిరించి కిడ్నాప్ చేయడం చట్టం దృష్టిలో అత్యంత తీవ్రమైన నేరం. నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయిన తరువాత నిందితులు లొంగిపోవడం అనేది చట్టపరమైన ప్రక్రియలో సాధారణంగా జరిగే పరిణామం.