TDP Counters to YS Jagan: ఏపీ ప్రభుత్వం విజయవాడలో వరద బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల విషయంలో వైఎస్ జగన్ సుదీర్ఘ సోషల్ మీడియా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. మీరు ఈ ట్వీట్ బెంగళూరులో ఉండి వేసారా? లండన్ లో ఉండి వేసారా? అని ఎద్దేవా చేస్తూ కౌంటర్ పోస్ట్ చేసింది. గత ఏడు రోజులుగా వరదలో కూడా బురద రాజకీయం చేస్తున్న నీ రోత రాజకీయానికి సమాధానాలు.. ఇవే అంటూ కౌంటర్ ఇచ్చింది. ముందుగా.. తమరు ఇస్తానన్న కోటి వరద బాధిత ప్రజలకు ఎప్పుడు ఇస్తున్నారు? అని ప్రశ్నించింది.


8 లక్షల మంది ఆహారం
1. చంద్రబాబు గారి సమర్ధతతో, ఈ ఒక్క రోజులో మూడు పూటలా కలిపి 8 లక్షల మందికి ఆహారం అందించాం. మంచి నీళ్ళు, పాలు వీటికి అదనం. ఇప్పటికే 66,454 కుటుంబాలకి నిత్యావసర వస్తువుల కిట్ పంపించాం. నీకు నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడి లక్షణం ఉంటే, పలానా ప్రాంతంలో, పలానా చోట ఆహారం అందలేదు అని సద్విమర్శ చేసే వాడివి. నీకు బురద చల్లటమే తెలుసు కాబట్టి, రోత ట్వీట్ వేశావ్.. ఇలాంటి నీచ రాజకీయం చేయటం, నీ ఒక్కడికే సాధ్యం జగన్


Also Read: చంద్రబాబూ ఇంత చేతగాని తనమా? మేం పోరాటాలు ఆపం - సీఎంకు జగన్ 8 ప్రశ్నలు


మతిమరుపు రోగం ఉంది కదా?
2. మూడు రోజుల్లో కాదు, రెండు గంటల్లో 40 సెం.మీ వర్షం పడింది. ఫ్లాష్ ఫ్లడ్ వచ్చింది. ప్రజలు చక్కగా సహాయక శిబిరాల్లో ఉన్నారు. అన్ని సౌకర్యాలు వారికి అందుతున్నాయి. బెంగుళూరులో ఉండే నీకు ఇలాంటివి తెలిసే అవకాశం లేదు. నీ ఇసుక మాఫియా కోసం, అన్నమ్మయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి, రాత్రికి రాత్రి 50 మందిని చంపేసావ్ గుర్తుందా? మతిమరుపు రోగం ఉంది కదా, గుర్తు ఉండదులే 


నీ డబ్బు పిచ్చ వల్లే ఈ ఘోరం
3. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? నీ 5 ఏళ్ళ చేతకాని తనం, నీ డబ్బు పిచ్చ వల్ల జరిగింది. ఏడాది క్రితం బుడమేరుకి గండి పడితే నిద్ర పోయావ్. బుడమేరు గట్టు పై మట్టి అమ్ముకుని సొమ్ము చేసుకున్నావ్. బుడమేరు ఆక్రమించి, ఫ్లాట్లు చేసుకుని అమ్ముకున్నావ్. టిడిపి ప్రభుత్వం చేపట్టిన బుడమేరు ఆధునీకరణ పనులు ఆపేసావ్. బుడమేరు పేరుతో రూ.500 కోట్లు వెనకేసావ్.


ఫ్లడ్‌ కుషన్‌ మైంటైన్ అవుతూనే ఉంది
4. బెంగుళూరులో ఉండే నీకు తెలియదు అనుకుంటా, శ్రీశైలం, సాగర్, పులిచింతల గేట్లు ఎప్పటి నుంచో తెరిచే ఉన్నాయి. ఫ్లడ్‌ కుషన్‌ మైంటైన్ చేస్తూనే ఉన్నారు. నీ మొఖానికి ఫ్లడ్ కుషన్ అంటే కూడా తెలిసే అవకాశం లేదులే. నీ చేతకాని పాలన లాగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి, 50 మందిని చంపలేదు. 17 రోజుల్లో పడాల్సిన వర్షం ఒక్క రోజులో పడటం వల్ల వచ్చిన ఉపద్రవం, దానికి తోడు నీ చేతకాని పాలనలో బుడమేరుకు గండి పడినా పట్టించుకోక పోవటం వల్ల వచ్చిన ఉపద్రవం ఇది.


5. శుక్రవారం రాత్రి వర్షం పడితే, శనివారం ఉదయానికి అధికారులు ఫీల్డ్ లో ఉన్నారు. NDRF, ఆర్మీ లాంటి వాళ్ళే ఆ వరదలో వెళ్ళలేని ప్రతికూల పరిస్థితి ఉంటే, వాలంటీర్లు ఎలా వెళ్తారు ? నీకు, నీ బులుగు మందకి ఎగురుకుంటూ వెళ్ళే విద్య ఏమైనా తెలుసా ? బురద చల్లటం ఆపి, వాస్తవిక ప్రపంచంలో బ్రతుకు. 


వేల మంది ఉద్యోగులు గ్రౌండ్ లోనే
6. నీకు బుర్ర లేదు, బుద్ది లేదు. ప్రజలకు సత్వర సేవ చేయటం కోసం, అటు ముఖ్యమంత్రి కాని, ఇటు మంత్రి నాదెండ్ల గారితో పాటు, ఇతర మంత్రులు కానీ పని చేస్తున్నారు. లోటు పాట్లు సరి చేసుకుంటున్నారు. ఇంట్లో తల్లి, చెల్లి పొడ కూడా గిట్టని నీకు, ఇలాంటివి అర్ధం కాదులే. వేల మంది ఉద్యోగులు గ్రౌండ్ లో ఏడు రోజులుగా పని చేస్తుంటే, నీకు, నీ సాక్షికి కనిపించటం లేదు. 


నువ్వు ఎలాంటి సరుకులు ఇచ్చావ్
7. ప్రతి దానికి ఉక్రోషం చూపించకు.. అసహ్యంగా ఉంటుంది.. ఒక మాజీ ముఖ్యమంత్రిలా ప్రవర్తించు.. హుందాగా ఉంటుంది. మేము ఎలాంటి సరుకులు ఇస్తున్నామో, నువ్వు ఎలాంటి సరుకులు ఇచ్చావో ప్రజలు గమనిస్తున్నారు. నీ లాగా ఒక టమాటా, ఒక బంగాళదుంప ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు మాది. నీ ఘనకార్యాలు గత 5 ఏళ్ళు చూసాం కదా.


8. బీద అరుపులా? నీ కళ్ళు, చెవులు సరిగ్గా పని చేస్తున్నాయా ? ప్రజలకు ఏ కష్టం రాకుండా ప్రతి చిన్న విషయం చంద్రబాబు గారు పట్టించుకుని మరీ ఆ కష్టం తీరుస్తున్నారు. నీలాగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 50 మంది చనిపోతే, హైదరాబాద్ లో విందులు వినోదాలు, పెళ్ళిళ్ళు పేరంటాలకు వెళ్ళలేదు. డ్వాక్రా అక్కచెల్లెమ్మెల దగ్గర బలవంతపు విరాళాలా? ఇలాంటి గాలి ఆరోపణలు ఆపి, మనిషిలా బ్రతుకు. బెంగుళూరులో ఉండే నువ్వు ఆదుకునేది ఏంటి? నువ్వు ఆదుకోవు.. నిన్ను అడ్రెస్ లేకుండా చేసిన ప్రజల పై కక్ష తీర్చుకుంటున్నావ్. అయినా లండన్ లో స్థిరపడే నీకు, మా రాష్ట్రం గురించి, మా ప్రజల గురించి , ఆలోచించే గుణం ఎక్కడ ఉంటుంది ? నీది కుళ్ళు రాజకీయం, శవ రాజకీయం.. కుతంత్రాలు చేసే రాజకీయం.. గత నాలుగు రోజులుగా శవాలు లేవట్లేదని అల్లాడిపోతున్నావు.. నీకు రాజకీయ నాయకుడి లక్షణాలే కాదు.. మనిషి లక్షణాలు కూడా లేవు. ఛీ.. ఛీ..’’ అని టీడీపీ కౌంటర్ ఇచ్చింది.


Also Read: చంద్రబాబూ ఇంత చేతగాని తనమా? మేం పోరాటాలు ఆపం - సీఎంకు జగన్ 8 ప్రశ్నలు