TDP ON FAKE VOTES: దొంగ ఓట్ల వ్యవహారంపై తెలుగు దేశం నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారంటూ సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన లేఖలో తెలుగు దేశం నేతలు పేర్కొన్నారు.


దొంగ ఓట్లపై తెలుగు దేశం సీరియస్...
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఓట్ల వ్యవహరంపై ప్రధాన పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారంటూ తెలుగుదేశం నేతలు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కొన్ని ఆధారాలను సైతం ఎన్నికల కమిషనర్ కు తెలుగు దేశం నేతలు సమర్పించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటుగా మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా, నక్కా ఆనంద్ బాబు పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఇతర నాయకులు ఈసీని కలసి ఫిర్యాదు చేశారు.


పంచ భూతాలను వైఎస్ఆర్ సీపీ నేతలు వదలటం లేదు...!
రాష్ట్రంలో పంచభూతాలను సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వదలటం లేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో ఓట్లు దొంగలు పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. 2019 తర్వాత ప్రజాబలంతో ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి గెలిచినన దాఖలాలు లేవని చెప్పారు. దేశ చరిత్రలో మొదటిసారి 5 కోట్ల మంది వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుని ఓటర్ లిస్ట్ లు తారుమారు చేస్తున్నారని అన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఓట్లు తొలగిస్తున్నారని సీఈవోకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఒక కుటుంబంలోని సభ్యులను వేరు వేరు బూత్ లలోకి మారుస్తున్నారని, 14 నియోజకవర్గాల్లో 2150 ఇంటి నంబర్లతో లక్షా 85 వేల ఓట్లు చేర్పించారని తెలిపారు. ఒక్కో ఇంటిలో 50 నుంచి 500 దొంగ ఓట్లు చేర్పించారని అన్నారు. దొంగ ఓట్ల విషయం నిజమని ఈసీ అధికారులు ఒప్పుకున్నారని చెప్పారు. బూత్ లెవల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమీషనర్ ను కోరామని చెప్పారు. అక్టోబర్ 17 న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వస్తుందని, ఈలోగా పూర్తి స్దాయిలో ఓట్ల జాబితా పై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని కోరారు.


ఓట్ల దొంగలపై నిఘా ...
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దొంగ ఓట్ల వ్యవహరంపై తెలుగు దేశం, వైఎస్ఆర్ సీపీ నేతల మధ్య వివాదం నడుస్తోంది. 60లక్షలకు పైగా దొంగ ఓట్లను టీడీపీ నేతలు చేర్పించారని అధికార పార్టీ ఆరోపిస్తోంది. అయితే ఈ వ్యవహరం పై తెలుగు దేశం నేతలు కూడ సీరియస్ గా స్పందిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నతాము దొంగ ఓట్లను చేర్పిస్తే, అధికారంలో ఉన్న వైసీపీ నేతలు వాటిని నిరూపించాలి కదా అంటూ నిలదీస్తున్నారు. తమ వద్ద ఉన్న ప్రాధమిక ఆధారాలతో ఎన్నికల కమిషనర్ కు టీడీపీ ఫిర్యాదు చేయడంతో ప్రతి బూత్ పరిధిలో ఉన్న దొంగ ఓట్లపై నిఘా పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 
Also Read: Tammineni on Fire : కంట్రోల్ తప్పిన స్పీకర్ - దిక్కున్న చోట చెప్పుకోవాలని మహిళపై ఆగ్రహం ! 
Join Us on Telegram: https://t.me/abpdesamofficial