Guntur MLA Vs Mayor :   గుంటూరు నగరపాలక సంస్థ మేయర్, తూర్పు నియోజకవర్గ ఎంఎల్ఏ కు మధ్య  పచ్చగడ్డి వేస్తే భగ్గుమమంటోంది.  ఇద్ధరూ అధికార వైసీపీ పార్టీకి చెందిన వారు అయినప్పటికి ఇద్దరి మధ్య ముఖాలు కూడా చూసుకోనంత శత్రుత్వం పెరిగిపోయింది.  ప్రతిపక్ష శాసన సబ్యులు తమ పనులు జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన ఘటనలు చూశాం...కానీ అధికార పార్టీ ఎంఎల్ఏ తన నియోజకవర్గం లో వర్క్స్ జరగడం లేదటూ ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా దణ్ణం పెడతాను మా వర్స్ పూర్తి చేయండి ఆంటూ సాగిల పడిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. ఈ అంశం వైరల్ కావడంతో హైకమాండ్ కూడా దృష్టి సారించింది. 


మేయర్ పదవి విషయంలో తన వర్గానికి అన్యాయం జరిగిందనుకుంటున్న  ముస్తఫా 


గుంటూరు తూర్పు ఎంఎల్ఏ ముస్తాఫా, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు మధ్య కొంత గ్యాప్ ఉంది. .గుంటూరు కార్పోరేషన్ పరిధిలో  మొత్తం మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు పూర్తిగా నగర పాలక సంస్థ పరిధిలోకి వస్తాయి. వైసీపీ పార్టీ అధికారంలో లేని సమయంలో ముస్తాఫా, కావటి మనోహర్ నాయుడు మధ్య సఖ్యత ఉండేది. పార్టీ అధికారంలోకి వచ్చిన  తర్వాత జరిగన కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది.  మేయర్ పదవిని చెరి రెండున్నర సంవత్సరాలు   ఈస్ట్, వెస్ట్ ప్రాంతాలకు కేటాయించారు. మొదటి రెండున్నర సంవత్సరాలు కావటి మనోహర నాయడు...మరో రెండున్నర సంవత్సరాలు రమేష్  గాంధీకి కేటాయించారు. అనారోగ్యంతో రమేష్ గాంధి మరణించారు. మనోహర్ కు కేటాయించిన రెండున్నర ఏళ్ళ పదవీ కాలంపూర్తి అయింది. మేష్ గాంధీ చనిపోయాడు కనుక మనోహర్ నే మేయర్ గా కంటిన్యూ అవుతున్నారు.  అప్పటి నుంచి ఈస్ట్ ఎంఎల్ఏ ముస్తాఫా కు మేయర్ మనోహర్ నాయుడికి మద్య విభేధాలు పొడచూపాయి. 


మేయర్ ను మార్చాలంటున్న ముస్తఫా 


మేయర్ ను మార్చే దిశగా ముస్తాఫా ప్రయత్నం ప్రారంభించారు..తన నియోజక వర్గ పరిధిలో ఉన్న కార్పొరేటర్లతో అసమ్మతి గళం వినిపించేందుకు సిద్ద మయ్యారు .  19 మంది కార్పొరేటర్లు సమావేశం అయి మేయర్  మనోహర్ కు వ్యతిరేకంగా గళం విప్పారు. వీరి   వెనుక ఉండి నడిపించింది ఎంఎల్ఎ అని  మేయర్ వర్గం అనుమానించింది.  ఇద్దరిని పిలిచి  హైకమాండ్ సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది.  అయితే మూడు రోజుల క్రితం జరిగిన కార్పొరేషన్ మీటింగ్ ను వేదికగా చేసుకొని చె ఎంఎల్ఏ ముస్తాఫా మరిన్ని ఆరోపణలు చేశారు.  తన పరిధిలోని   డివిజన్ లో అభివృద్ధి పనులు చేయడం లేదని  ఒక రేంజ్ లో విరుచుకు పడ్డారు .తాను  చేసిన పాపమేమిటని ప్రశ్నించారు...వార్డులలో తిరుగుతూంటే  ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. .తమపరిధిలోని అభివృద్ధి  కార్యక్రమాలు జరగక పోవడానికి కారణం ఏమిటో చెప్పాలని మేయర్ ను ప్రశ్నించారు..


మస్తఫా సీటు కోసం డిప్యూటీ మేయర్ ప్రయత్నాలు 


వరుసగా రెండు సార్లు ముస్తాఫా ఈస్ట్ నియోజకవర్గం ‌నుంచి విజయం సాధించారు..  మూడవ సారి సీటు దక్కటం కష్టమన్నట్లు టాక్ వినిపిస్తోంది.  నియోజకవర్గంలో‌ వ్యతిరేకత పెరిగిందంటున్నారు. ఇది గమనించిన ముస్తాఫా ఇక తాను పోటీ చేయనని ఆ సీటు తన కుమార్తెకు ఇవ్వాలని సీయం వద్ద ప్రపోజల్ పెట్టారు. అయితే  డిప్యూటీ మేయర్ సజీలా ఈస్ట్ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముస్తాఫా కుమార్తె కంటే తను అన్ని విధాల ముందంజలో ఉన్నానని చెబుతున్నారు. జరుగుతున్న పరిణామాలు  ఎప్పటికప్పుడు గమనిస్తున్న ముస్తాఫా మీడియాని ఎట్రాక్ట్ చేసి ప్రజలలో తన  పేరు నలిగేలా  నగర పాలక సంస్థ సమావేశాలను ఒక రేంజ్ లో వాడుకొనే ప్రయత్నం చేసారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.   


Join Us on Telegram: https://t.me/abpdesamofficial