టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశం కావడంపై అధికార పార్టీకి చెందిన లీడర్లు సెటైర్లు, విమర్శలు, ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కేవలం వారే కాకుండా ఈ విషయంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తలదూర్చారు. కులాల పేర్లను ప్రస్తావిస్తూ కాస్త అభ్యంతరకర రీతిలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై జనసేన, టీడీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అత్యంత దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. వీరు బూతులు తిడుతూ కామెంట్లలో పెడుతుండగా.. వైఎస్ఆర్ సీపీ అభిమానులు మాత్రం రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి మాట్లాడి ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టడంపై పరోక్షంగా రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. ‘‘కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని, కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు.. RIP కాపులు, కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు’’ అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
రామ్ గోపాల్ వర్మ ఈ స్పందనపై తాజాగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. ‘‘కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా, కానీ పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు.. #RIPRGV, కంగ్రాట్స్ జగన్ రెడ్డి’’ అని ఆర్జీవీ శైలి ట్వీట్ తరహాలోనే బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. అంతేకాక, రామ్ గోపాల్ వర్మని, వైఎస్ జగన్‌ను దీనికి ట్యాగ్ చేశారు.