స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో కీలకమైన మలుపు జరిగింది. ఈ కేసులో మొత్తం 12 మంది ఐఏఎస్‌ అధికారులను విచారణ చేయాలని టీడీపీ తరపు లాయర్ ప్రసాద్‌ సీఐడీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సిమెన్స్‌ ప్రాజెక్టు అమలు జరగడం, పర్యవేక్షణ కమిటీల్లోని అధికారులను విచారణ చేయాలని ఆయన ఫిర్యాదులో కోరారు. అధికారుల్లో అజయ్‌ కల్లం రెడ్డి, అజయ్‌ జైన్‌, రావత్‌, రవిచంద్ర, ఉదయలక్ష్మి, ప్రేమ్‌ చంద్రారెడ్డి, సిసోడియా, కేవీ సత్యనారాయణ, కృతిక శుక్ల, శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌, అర్జున్‌ శ్రీకాంత్‌, జయలక్ష్మిలను విచారణ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 


ప్రస్తుత స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొండూరు అజయ్‌ రెడ్డి, అప్పటి సీఎండీ బంగారు రాజులతో పాటు కార్పొరేషన్‌లోని సీఎఫ్‌వో, సీఈవో, ఈడీని విచారణ చేయాలని కోరారు. కాంట్రాక్ట్‌, చెక్‌ పవర్‌తో సంబంధం ఉన్న వివిధ స్థాయిల్లోని అధికారులను కూడా ప్రశ్నించాలని సీఐడీకి ఫిర్యాదు చేశారు.