YS Jagan Latest News: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ సొమ్ముతో తన సొంత ఇంట్లో సకల సౌకర్యాలు కల్పించుకున్నారనే ఆరోపణల విషయంలో అధికార, ప్రత్యర్థి పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా పోస్టుల పర్వం కొనసాగుతోంది. జగన్ ఇంట్లో ఉన్న ప్రభుత్వ సొమ్ముతో చేయించిన ఫర్నీచర్ ను.. ఆయన పదవి కోల్పోయాక తిరిగి ప్రభుత్వానికి సరెండర్ చేయకుండా వాడుకుంటున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అసలు ప్రజల డబ్బులతో ఇంటికి సౌకర్యాలు పొందడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.


దీనిపై వైఎస్ఆర్ సీపీ వివరణ ఇచ్చింది. ఆ పార్టీ తరపున ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఓ లేఖ విడుదల చేశారు. ప్రభుత్వానికి చెందిన ప్రతి వస్తువుకు డబ్బులు కడతామని తెలిపారు. ప్రభుత్వ జీవోల ప్రకారం ఈ వస్తువులకు ఉన్న రేట్లను అనుసరించి ఖరీదు కట్టాలని అధికారులను జగన్ క్యాంప్ ఆఫీస్.. ప్రభుత్వ అధికారులను కోరారని తెలిపారు. ఆ ఫైలు ప్రక్రియలో ఉందని.. ఇంతలోనే ఎంపీలతో వైయస్ జగన్‌ సమావేశం ఫొటోలను పట్టుకుని టీడీపీ వికృత పోస్టింగులు పెడుతోందని టీడీపీ నేతలు ఆరోపించారు.






టీడీపీ కౌంటర్
దీనిపై తాజాగా టీడీపీ మరో కౌంటర్ ఇచ్చింది. ‘‘తప్పుడు ప్రచారాలు పుట్టేదే ఆ కోళ్ల ఫారం కొంపలో.. వ్యక్తిత్వం లేని నీతిమాలిన వ్యక్తి ఎవరో, సొంత తల్లి, సొంత చెల్లి చెప్పారులే కానీ, ముందు ఇంట్లో పెట్టుకున్న ఫర్నీచర్ ప్రభుత్వానికి ఇవ్వు. మరీ కక్కుర్తి కాకపోతే, నువ్వు ఇంట్లో పడుకునే మంచం, కూర్చునే కుర్చీ  కూడా ప్రభుత్వ డబ్బుతో తీసుకోవాలా ? ఛీ ఛీ..’’ అని టీడీపీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.