ఎన్టీఆర్(NTR) శత జయంతి కార్యక్రమాలు నేడు విజయవాడ(Vijayawada) సమీపంలోని తాడిగడపలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సూపర్ స్టార్ రజనీ కాంత్(Rajini Kanth) హజరు కానున్నారు. దీంతో భారీగా ఏర్పాట్లు చేశారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు..
మహనీయుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఇవాళ జరగనున్నాయి. ఎన్టీఆర్ శత జయంతి సభ, ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ నేతృత్వంలో ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు, ఎన్టీఆర్ అసెంబ్లీ ప్రసంగాలు..పుస్తకావిష్కరణ కార్యక్రమం నేడు జరుగనుంది. సూపర్ స్టార్ రజినీకాంత్, నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హజరు కానున్నారు.
నేటి షెడ్యూల్ ఇదే...
ఎన్టీఆర్ లిటరేచర్, సావనీయర్ అండ్ వెబ్సైటు కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం నాలుగున్నర గంటలకు, విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ అసెంబ్లీ, చారిత్రిక ప్రసంగాల ఆవిష్కరణ సభ జరుగుతుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా, అల్ ఇండియా సూపర్ స్టార్ రజనికాంత్,శాసన సభ్యుడు, ఎన్టీఆర్ నట వారసుడు నందమూరి బాలకృష్ణ విశిష్ట అతిథులుగా, ప్రముఖ జాతీయ జర్నలిస్ట్ వెంకటనారాయణ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
స్పెషల్ అట్రాక్షన్‌గా బుర్రకథలు, పౌరాణిక కార్యక్రమాలు..
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పలు స్పెషల్ అట్రాక్షన్ కార్యక్రమాలు ఉంటాయి. నేటి సాయంత్రం 4.30కు ప్రఖ్యాత బుర్రకథకుడు నాజర్ కుమారుడు బాబూజీ బృందంతో బుర్రకథ ఉంటుంది.
4.50: మన దేశం సినిమా నుంచి ఎన్టీఆర్ నటించిన తొలి సన్నివేశం ప్రదర్శిస్తారు.
4.55: తెల్లన్నం షార్ట్ ఫిలిం
5.00: ఎన్టీఆర్‌కు నివాళిగా జయ జయహే గీతం..
5.05: మాయాబజార్ సినిమాలోని ఒక సన్నివేశం ప్రదర్శిస్తారు. ప్రఖ్యాత రంగస్థలం నటుడు గుమ్మడి గోపాలకృష్ణ దీన్ని నిర్వహిస్తారు.
5.10: మా హక్కు షార్ట్ ఫిలిం ప్రదర్శిస్తారు.
5.35: సౌమ్య బృందంతో సాంప్రదాయ నృత్యం
5.40: ఎన్టీఆర్‌పై ప్రత్యేకంగా తయారు చేసిన ఏవీ ప్రదర్శిస్తారు.
5.45: అతిథులు ఆహ్వాన కార్యక్రమం ప్రారంభం
6.00: జ్యోతి ప్రజ్వలన
6.10: మా తెలుగు తల్లికి గీతాలాపన
6.15: కమిటీ అధ్యక్షుడు, టీడీ జనార్దన్ ఉపన్యాసం ఉంటుంది.
6.20: నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ శాసనసభ ప్రసంగాలు పుస్తకావిష్కరణ చేసి వెంకటనారాయణ అందజేస్తారు.
6.25: ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు పుస్తకావిష్కరణను రజనీకాంత్ చేస్తారు. బాలకృష్ణకి అందజేస్తారు.
6.30: విక్రం పూలా రచించిన పుస్తకాలను పరిచయం చేస్తారు.
6.35: అతిథుల సత్కారాలు
7.00: వెంకటనారాయణ సందేశం
7.10: నందమూరి బాలకృష్ణ మాట్లాడతారు.
7.20: రజనీకాంత్ ప్రసంగం ఉంటుంది.
7.35: నారా చంద్రబాబు నాయుడి ప్రసంగం
తర్వాత జాతీయ గీతాలాపనతో సభ ముగుస్తుందనినిర్వాహకులు తెలిపారు.
రజినీకి భారీ స్వాగత ఏర్పాట్లు...
బెజవాడకు వస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్‌కు భారీగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే బాలయ్య విజయవాడకు చేరుకున్నారు. సభ ఏర్పాట్లపై నిర్వాహకులతో చర్చించారు. చెన్నై నుంచి సూపర్ స్టార్ రజనీ గన్నవరం విమానాశ్రయానికి కాసేపటి క్రితమే వచ్చారు. చెన్నయ్ నుంచి గన్నవరం విమానాశ్రయం కి చేరుకున్న రజినీ కాంత్‌కు ఎమ్మెల్యే బాలకృష్ణ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా విజయవాడలోని స్టార్ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడే సాయంత్ర వరకు బస చేస్తారు. సాయంత్రం 5 గంటల తరువాత హోటల్ం నుంచి అభిమానుల సమక్షంలోనే భారీ ర్యాలీతో సభా ప్రాంగణానికి రజినీ కాంత్, బాలయ్య చేరుకుంటారు.