Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల్లో అభివృద్ధి కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రంగాల్లో నిపుణులను ప్రత్యేక సలహదారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీళ్లంతా ఆయా పదవుల్లో రెండేళ్లపాటు ఉంటారు. వీళ్లకు కేబినెట్‌ హోదాతోపాటు ీ పదవులు లభించాయి. 


ప్రభుత్వం నియమించిన సలహాదారులు వీళ్లే 
సుచిత్ర ఎల్ల(భారత్‌ బయోటెక్‌ సంస్థ ఎండీ)- చేనేత, హస్తకళల అభివృద్ధి
శ్రీధర ఫణిక్కర్‌ సోమనాథ్(ఇస్రో మాజీ ఛైర్మన్‌ )-స్పేస్‌ టెక్నాలజీకి 
సతీష్‌రెడ్డి(కేంద్ర రక్షణశాఖ సలహాదారు)-ఏరోస్పేస్, డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌ 
కేపీసీ గాంధీ(ప్రముఖ ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త)-ఫోరెన్సిక్‌ సైన్స్‌ రంగం 


సుచిత్ర ఎల్ల
భారత్‌ బయోటెక్‌ సంస్థ సహ వ్యవస్థాపకురాలు అయిన సుచిత్ర ఎల్ల. భారత్‌ బయోటెక్‌ ఎండీగా ఉంటూనే, ఎల్ల ఫౌండేషన్‌ రన్ చేస్తున్నారు. చేనేత, హస్తకళల రంగ అభివృద్ధికి సలహాలు ఇస్తారు. చేపట్టాల్సిన ప్రణాళికలు గురించి ప్రభుత్వానికి సలహాలు ఇస్తారు. ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు రాష్ట్రంలో అమలు అయ్యేలా సూచనలు చేస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అనుసరించాల్సిన మార్కెటింగ్‌ వ్యూహాలపై కూడా చర్చిస్తారు. ఈ రంగంలోకి పెట్టుబడులను ఆహ్వానించి ఏపీ చేనేత బ్రాండ్‌ను ఇంప్రూవ్ చేయడం వీళ్ల టార్గెట్. ముఖ్యంగా మహిళలను ప్రోత్సహించనున్నారు. ప్రత్యేక కళలకు జీఐ, మేధోసంపత్తి హక్కులు పొందేందుకు సహకారం అందిస్తారను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 


సతీష్‌రెడ్డి
డీఆర్‌డీఓ ఛైర్మన్‌గా వ్యవహరించిన సతీష్‌రెడ్డి చాలా కీలకమైన పదవుల్లో ఉంటూ దేశాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించారు. రక్షణశాఖకు సలహాదారుగా పని చేస్తున్నారు. ఏపీని ఏరోస్పేస్, డిఫెన్స్‌ పరిశోధన, తయారీ రంగానికి గమ్యస్థానంగా మార్చడం ప్రభుత్వం టార్గెట్. దీనికి చేపట్టాల్సిన కార్యచరణ, అనుసరించాల్సిన వ్యూహాలను చర్చిస్తారు. లేటెస్ట్ రక్షణ, సాంకేతికతలకు అనుగుణంగా సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ల ఏర్పాటుకు సూచనలు సలహాలు ఇస్తారు. ప్రపపంచ స్థాయి రక్షణ సంస్థల పెట్టుబడులు పెట్టేలా అవసరమైన గ్రౌండ్‌ను ప్రిపేర్ చేయడం కూడా ఈయన పనుల్లో ఒకటి. 


కేపీసీ గాంధీ
సీఎఫ్‌ఎస్‌ఎల్‌లో పని చేసిన ప్రముఖ ఫోరెన్సిక్‌ సైన్స్‌ శాస్త్రవేత్తే డాక్టర్‌ కేపీసీ గాంధీ. ప్రస్తుతం ట్రూత్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేసుకొని సేవలు అందిస్తున్నారు. గతంలో ఏపీ , పశ్చిమబెంగాల్, జమ్ము కశ్మీర్‌కు సలహాదారుగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాల డైరెక్టర్‌గా పని చేస్తూనే రిటైర్ అయ్యారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌ రంగంలో రాష్ట్రంలో ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు గురించి సలహాలు ఇస్తారు. వివిధ దేశాల్లో అనుసరిస్తున్న వ్యూహాలను గమనిస్తారు. నేరస్తుల గుర్తింపు కోసం ఫోరెన్సిక్‌ డేటా ఇంటిగ్రేషన్‌కు హెల్ప్ చేస్తారు. ఈ టెక్నాలజీని డెవలప్ చేసేందుకు సహకరిస్తారు. కొత్తగా వచ్చిన టెక్నాలజీతో ఫోరెన్సిక్‌ ల్యాబ్ ఏర్పాటు చేసేందుకు సూచలు ఇస్తారు. రాష్ట్రంలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసేలా వివిధ సంస్థలను ఒప్పించే బాధ్యత అప్పగించారు. 


సోమనాథ్‌
స్పేస్‌ టెక్నాలజీ రంగంలో నాలుగు దశాబ్ధాల అనుభవం ఉంది. 2022 నుంచి మూడేళ్ల పాటు ఇస్రో ఛైర్మన్‌గా సేవలు అందించారు. ఇప్పుడు విక్రమ్‌ సారాభాయి స్పేస్‌ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో స్పేస్‌ టెక్నాలజీ వాడుకొని సేవలు సులువుగా అందించేందుకు విధానాలు రూపొందిస్తారు. ముఖ్యంగా    వ్యవసాయం, విపత్తు నిర్వహణ, అర్బన్‌ ప్లానింగ్, వాతావరణ మార్పులు ఇలా వీటిలో స్పేస్ టెక్నాలజీ వాడుకొని ప్రజలకు ఉపయోగపడటంపై దృష్టి పెట్టనున్నారు.