YS Jagan London Tour | అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) పుత్రికోత్సాహంలో మునిగి తేలుతున్నారు. కుమార్తె సాధించిన ఘనతపై జగన్ దంపతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ చిన్న కుమార్తె వర్ష ప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్‌ కాలేజ్‌ నుంచి మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ నుంచి ఫైనాన్స్‌ విభాగంలో పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా  కుమార్తె వర్షారెడ్డికి జగన్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్‌ ఖాతాలో జగన్ పోస్ట్‌ చేశారు. 

కుమార్తె వర్షకు అభినందనలు.. ‘కంగ్రాచులేషన్స్. లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన కింగ్స్‌ కాలేజ్‌ నుంచి   పట్టభద్రురాలు కావడమే కాదు, డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణత సాధించినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఆ దేవుడి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలి’ అని వైఎస్ జగన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. చిన్న కుమార్తె వర్ష గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న సందర్భంగా తన ఫ్యామిలీతో దిగిన ఫొటోను ఆయన పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మాజీ సీఎం జగన్ తన కుటుంబానికి టైం కేటాయించారు.

 

Also Read: AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ, మహిళలకు ఉచిత బస్సు సహా చర్చించే కీలక అంశాలివే