ABP  WhatsApp

Pawan Kalyan: అక్షరాలు రాని వ్యక్తి సీఎంగా ఉండడం మన దౌర్భాగ్యం - జగన్ కామెంట్స్‌కు పవన్ కౌంటర్

ABP Desam Updated at: 28 Jun 2023 08:28 PM (IST)

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో భీమవరం నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు.

పవన్ కల్యాణ్

NEXT PREV

అమ్మ ఒడి నిధుల విడుదల బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పవన్ కల్యాణ్ పై చేసిన తీవ్ర వ్యాఖ్యలపై తాజాగా జనసేన అధినేత కౌంటర్ ఇచ్చారు. సరిగ్గా అక్షరాలు రాని ముఖ్యమంత్రి ఉండడం తెలుగు రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం అని అన్నారు. వరాహికి.. వారాహికి కనీసం తేడా తెలియదా అని అన్నారు. తాను గతంలో చెప్పు తీసి చూపించి మాట్లాడానంటే దాని వెనక చాలా జరిగిందని అన్నారు. తాను ఊగిపోతూ మాట్లాడుతున్నానని జగన్ బాధపడిపోతున్నారని, ఇక నుంచి జగన్ స్టైల్ లోనే మాట్లాడతానని అన్నారు. అసలు అమ్మ ఒడి లాంటి కార్యక్రమంలో సీఎం జగన్ అలాంటి మాటలు మాట్లాడవచ్చా అని కౌంట్ వేశారు.


మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో భీమవరం నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ నెల 30న వారాహి విజయయాత్ర సభ భీమవరంలో ఉంటుందని అందరి సహాయ సహకారాలు కావాలని పవన్ కల్యాణ్ కోరారు. ఈసారి జనసేన జెండా ఎగరాలని ఆకాంక్షించారు. సీఎం జగన్ ప్రసంగం సమయంలోని ఉండే బాడీ లాంగ్వేజ్ ని అనుకరిస్తూ తాను కూడా ఇకపై అలాగే ఉంటానని ఎద్దేవా చేశారు.



అ నుంచి అం, అ: వరకూ అక్షరాలు రావు. దీర్ఘాలు రావు. అందుకని జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద ముఖ్యమంత్రికి నేనే దీర్ఘాలు, అక్షరాలు నేర్పిస్తా. అలాంటి ఒక నియంత, ఒక కంఠకుడు తెలుగు ఉచ్ఛారణ సరిగ్గా లేని వ్యక్తి తెలుగు రాష్ట్రానికి సీఎంగా ఉండడం బాధాకరం. - పవన్ కల్యాణ్

Published at: 28 Jun 2023 07:30 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.