AP CM Jagan about Pawan Kalyan: దత్తపుత్రుడు, లారీ ఎక్కి తిరుగుతున్నాడు, నాలుగు పెళ్ళిళ్ళు, ఇలాంటి పదాలతోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఏపీ సీఎం వైఎస్ జగన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు పవన్ ను పేరు పెట్టి జగన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేయకపోవటంపై సొంత పార్టి నేతల్లోనే చర్చ జరుగుతోంది..


పవన్ పై జగన్ కోడింగ్ భాష....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాల పై విమర్శలు వ్యవహరంలో డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగు దేశంపై విమర్శలు చేసే సమయంలో చంద్రబాబును వెన్నుపోటు దారుడు అంటూ కోడింగ్ భాషను జగన్ ఉపయోగించేవారు. అప్పుడప్పుడు నేరుగానే చంద్రబాబు అని పేరు పెట్టి వ్యాఖ్యాలు చేసేశారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాత్రం ఇప్పటి వరకు జగన్ డిఫరెంట్ గానే స్పందిస్తూ వస్తున్నారు. మొదట్లో దత్తపుత్రుడు అంటూ కామెంట్స్ చేయటం ద్వార ప్రారంభం అయిన జగన్ దాడి ఇప్పటి వరకు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి అంటూ పవన్ ను ఉద్దేశించి ఇన్ డైరెక్ట్ గా జగన్ విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ ను ఉద్దేశించి చేస్తున్న ఆరోపణలు, విమర్శలు , రాజకీయ వ్యాఖ్యల్లో జగన్ పవన్ ను పేరు పెట్టి సంభోదించిన దాఖలాలు లేవని పార్టి వర్గాలు అంటున్నాయి. పవన్ ను జగన్ పేరు పెట్టి ఎప్పుడ విమర్శలు చేస్తారంటూ, సొంత పార్టీ నేతల్లోనే విస్తృతంగా చర్చ జరుగుతోంది.


ఆ మాటలతోనే కేరింతలు...
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగే పర్యటనల్లో రాజకీయ పార్టిలు, ప్రతిపక్ష పార్టిల పై విమర్శలు చేస్తూ కౌంటర్ లు కూడా ఇస్తున్నారు. అయిత్ పవన్ విషయంలో మాత్రం జగన్ చాలా డిఫరెంట్ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ పై ఉన్న విమర్శలు నేపద్యంలో కొన్ని కోడింగ్ భాషలను జగన్ ఉపయోగిస్తున్నారు కాని, నేరుగా పవన్ పేరును మాత్రం ప్రస్తావించటం లేదు. పవన్ ను ఉద్దేశించి చేసే వ్యాఖ్యల్లో భాగంగా జగన్ దత్త పుత్రుడు అంటూ మెదటి నుండి విమర్శలు చేస్తున్నారు. జగన్ వెంట ఆ పదం రాగానే జనం నుండి జోరుగా రెస్పాన్స్ వస్తుంది. సభా ప్రాంగణం మెత్తం కేరింతలు, హర్షధ్వానాలతో ,జగన్ పేరు పెట్టి నినాదాలు చేయటం పరిపాటిగా మారింది. దీంతో అదే ఉత్సాహంతో జగన్ కూడ పవన్ పేరు ఎత్తకుండానే కామెంట్స్ చేస్తూ సరిపెడుతున్నారని నేతలు అంటున్నారు.


పవన్ పేరు ఎప్పుడు పలుకుతారు...
పవన్ పేరును జగన్ నేరుగా ఎప్పుడు పలుకుతారో అంటూ సొంత పార్టీకి చెందిన నేతల్లోనే ఇటీవల చర్చ మెదలైంది. తాజాగా పవన్ వారాహి యాత్ర పేరుతో ఉభయ గోదావరి జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు. దీంతో రాజకీయంగా పవన్ సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. దాని ప్రభావం ఆయా జిల్లాలపై పడే అవకాశం ఉండటంతో ఇప్పటికే జగన్ అలర్ట్ అయ్యి, ఆయా ప్రాంతాల్లోని కాపు నేతల తో పాటుగా , పార్టికి చెందిన సీనియర్ నేతలను అలర్ట్ చేస్తూ సమావేశాల్లో హెచ్చరించారు. తాజా జగన్ కూడా పవన్ పై ఎదురు దాడి స్పీడ్ పెంచారని అంటున్నారు. అమ్మ ఒడి సభా వేదికపై చంద్రబాబు కన్నా పవన్ ను ఉద్దేశించే జగన్ కామెంట్స్ చేశారు. అయితే పవన్ పేరు మాత్రం ఎత్త లేదు. దత్తపుత్రుడు, ఊగిపోతూ లారీ ఎక్కి మాట్లాడుతున్నారు, తనకు నచ్చని వారిని తిడుతున్నాడు, నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటూ పవన్ ను జగన్ కాస్త ఎక్కువ సేపే తిట్టేందుకు ప్రయత్నించారు. అయినా ఎక్కడా పవన్ పేరు ప్రస్తావనకు రాకపోవటం విశేషం.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial