Tadikonda YSRCP :   తాడికొండ వైఎస్ఆర్‌సీపీ రాజకీయం కొలిక్కి వచ్చేసినట్లయిది.  నియోజకవర్గానికి పర్యవేక్షకుడిగా నియమితుడయిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ .. ఇప్పుడు జిల్లా పార్టీ కూడా అద్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ పరిణామంతో తాడికొండ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాదేనని తేలిపోయిందని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. 
 


వైఎస్ఆర్‌సీపీ నుండి తాడికొండ శాసనసభ్యురాలుగా ఉండవల్లి శ్రీదేవి 2019 ఎన్నికల్లో విజయం సాధించారు.  అయితే ఆమె ఆది నుండి వివాదాల్లో వ్యక్తిగా నిలిచారు. ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ను సీఎం జగన్ స్వయంగా పార్టీలోకి తీసుకువచ్చారు. హైదరాబాద్ లో వైద్య రంగంలో ఉన్న ఆమె రాజకీయా పట్ల ఆసక్తి ఉండటంతో వైసీపీ పార్టిలో చేరి రిజర్వుడ్  నియోజకవర్గం అయిన తాడికొండ నుండి పోటీ చేసిన తొలి సారే విజయం సాదించారు. ఆమె ఎంత తొందరగా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే  అయ్యారో అంతే వేగంగా వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. 


నియోజవర్గంలో స్దానికుడయిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తో శ్రీదేవికి విభేదాలు వచ్చాయి. బాపట్ల ఎంపీగా గెలిచిన నందిగం సురేష్, తన నియోజకవర్గ వ్యవహారాల్లో వేలు పెట్టడంపై శ్రీదేవి అభ్యంతరం తెలిపారు. దీంతో రెండు వర్గాలు నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం చేసిన ప్రయత్నాలు కలకలం రేపాయి. అదే సమయంలో ఇసుక వ్యవహరంలో కూడా సురేష్ అనుచురులు  ఇష్టాను సారంగా వ్యవహరించటం పై శ్రీదేవి వర్గం బహిరంగంగానే విమర్శలు చేసింది. దీంతో అదిష్టానం వీరి వ్యవహరంలో జోక్యం చేసుకొని సర్దుబాటు చేసింది.అయితే అది ఎంతో సేపు ఆగలేదు. అదే సమయంలో నియోజకవర్గంలో బ్యానర్ల వ్యవహరం తెరమీదకు వచ్చింది. పార్టీ తరపున ఏర్పాటు చేసే బ్యానర్లలో తన ఫోటో లేకపోవటం పై ఎమ్మెల్యే శ్రీదేవి అభ్యంతరం తెలిపారు. అంతే కాదు నియోజకవర్గానికి పార్టీ నాయకులు వస్తే, ప్రోటోకాల్ ప్రకారం తనకు సమాచారం ఇవ్వకుండా రావటం పై కూడ శ్రీదేవి బహిరంగంగానే నిరసన వ్యక్తం చేశారు. 


ఇలా వరుసగా వివాదాలు తెరమీదకు వచ్చిన సందర్బంలోనే పేకాట క్లబ్ వ్యవహరం కూడా తీవ్ర సంచలనంగా మారింది. ఒక ప్రైవేట్ విల్లాలో జరిగిన పేకాట క్లబ్ వ్యవహరం తీవ్ర సంచలనం రేకెత్తించింది.దీంతో వరుస వివాదాల్లో ఎమ్మెల్యే పార్టీకి కూడ తలనొప్పిగా మారారు. ఈ సమయంలోనే తాడికొండ నియోజకవర్గానికి పర్యవేక్షకుడిగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ను జగన్ నియమించారు.ఈ వ్యవహరం పై కూడా శ్రీదేవి వర్గం నిరసన వెలిబుచ్చింది. స్వయంగా డొక్కాను కూడ శ్రీదేవి వర్గం ఎదురించి,ఘోరావ్ చేసింది. పార్టీ పెద్దలు కూడ డొక్కాకు మద్దతు ఇవ్వటంతో,శ్రీదేవి వర్గం సైలెంట్ కాక తప్పలేదు.


టీడీపీ నుండి వైసీపీ తీర్దం పుచ్చుకున్న డొక్కా మాణిక్య వరప్రసాద్, పార్టీ మారిన తరువాత  ఎమ్మెల్సీగా పదవిని దక్కించుకున్నారు. ఆ తరువాత ఆయన తాడికొండ నియోజకవర్గం కు పర్యవేక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు  గుంటూరు జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా నియమితులయ్యారు.  గతంలో గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా  మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఉన్నారు.  తనకు పదవి వద్దని ఆమె తేల్చారు.  దీంతో ఆ స్దానంలో అదే సామాజిక వర్గానికి చెందిన డొక్కాను పార్టి నియమించింది. దీంతో ఈ విదంగా డొక్కా తాడికొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయ్యిందని పార్టి వర్గాల్లో చర్చ జరుగుతుంది.