ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం సమావేశం పూర్తి అయింది. జీపీఎస్ విధానాలపై ఉద్యోగ సంఘాలతో ఈ కమిటీ చర్చలు జరిపింది. భేటీ ముగిసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాలతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని అన్నారు. మరికొన్ని అంశాలు చేర్చాలని ఉద్యోగ సంఘాలు అడిగాయని.. అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పామని అన్నారు.
‘‘చర్చలు సుహృదభవ వాతావరణంలో జరిగాయి. మరికొన్ని అంశాలు చేర్చాలని ఉద్యోగ సంఘాల నేతలు అడిగారు. అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పాము. చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం బీజేపీ గేట్లు తెరుస్తుందేమో అని చూడడం కోసమే. బీజేపీ గేట్లు తెరిస్తే దూరాలని చూస్తున్నాడు. సీఎం జగన్ ను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు మతిపోయి మాట్లాడుతున్నాడు. ఉగాది తర్వాత రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ కనుచూపుమేరలో కూడా కనపడదు. చంద్రబాబు ముసలి జిత్తులమారి నక్క. చంద్రబాబు సంయమనంతో మాట్లాడాలి. మాజీ సీఎం అయి ఉండి ముఖ్యమంత్రి గురించి ఎలా మాట్లాడాలి.
మనిషికి వయసు కాదు పరిపక్వత ఉండాలి. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఎన్నికల ప్రజాక్షేత్ర౦లో ఎవరి సత్తా ఏంటో తేలుతుంది. చంద్రబాబు లాంటి దుష్ట శక్తులు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఒంటరిగా పోరాటం చేసి ప్రజలను మెప్పిస్తాం.’’ అని బొత్స సత్యనారాయణ అన్నారు.