Ambati Rambabu: చంద్రబాబు రోడ్ షో అట్టర్ ప్లాఫ్, కోడెల ఆత్మహత్యకు ఆయనే కారణం - అంబటి రాంబాబు

ABP Desam   |  27 Apr 2023 01:13 PM (IST)

సత్తెనపల్లిలో చంద్రబాబు కార్యక్రమానికి జనాలు ఎవరూ రాలేదని, రాకపోయినా వచ్చారని చెప్తూ మహా అద్భుతం అంటున్నారని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

అంబటి రాంబాబు (ఫైల్ ఫోటో)

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చావుకు ప్రధాన కారణం చంద్రబాబే అని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సత్తెనపల్లిలో చంద్రబాబు చేసిన రోడ్ షో అట్టర్ ప్లాఫ్ అని అన్నారు. సత్తెనపల్లిలో చంద్రబాబు కార్యక్రమానికి జనాలు ఎవరూ రాలేదని, రాకపోయినా వచ్చారని చెప్తూ మహా అద్భుతం అంటున్నారని ఎద్దేవా చేశారు. నిజం చెప్తే చంద్రబాబు తల వెయ్యి ముక్కలయ్యేలా శాపం ఉందని, అందులో భాగంగానే సత్తెనపల్లిలో కూడా చంద్రబాబు ఒక్క నిజం కూడా మాట్లాడలేదని ఎగతాళి చేశారు. మంత్రి అంటి రాంబాబు గురువారం మీడియాతో మాట్లాడారు.

నీ కన్నా, నీ కొడుకు కన్నా, కొడెల శివప్రసాద్ కన్నా.. వంద రెట్లు నీతి మంతుణ్ని నేను. తెలుగు దేశం నాయకులకు కూడా అన్యాయం జరగకూడదని భావించే మంచి వ్యక్తిని నేను. నన్ను ఆంబోతు అంటారా? చంద్రబాబు ఎక్కడ పుట్టారు.. ఎక్కడ పెరిగారు. ఆయన జీవితం అంతా ఆంబోతులకు ఆవులు సప్లై చేయడమే సరిపోయింది. -

చంద్రబాబు పదే పదే సైకో పోవాలి, సైకిల్ రావాలని అంటున్నారని, చంద్రబాబే ఒక రాజకీయ సైకో అంటూ సీరియస్‌ అయ్యారు. అధికారం లేకపోతే చంద్రబాబు బతకలేడని వ్యాఖ్యానించారు. రెక్కల కష్టంలో పార్టీని ఒంటి చేత్తో నిలబెట్టిన జగన్‌ సీఎంగా అనర్హుడా? అని ప్రశ్నించారు. మరి చంద్రబాబు, నారా లోకేష్‌ మాత్రమే అర్హులా? అని అడిగారు. ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు అసలు పేదలకు మంచి చేశారా అని నిలదీశారు. సీఎం జగన్ పేద ప్రజలకు రెండు లక్షల కోట్ల డబ్బులను వారి ఖాతాల్లో వేసి ధనవంతులుగా చేసే ప్రయత్నం చేశారని అన్నారు. కోడెల శివప్రసాదరావు ఉరి వేసుకోవడానికి ప్రధాన కారణం చంద్రబాబే అని అన్నారు. కోడెల కుటుంబానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ముమ్మాటికీ తన రాజకీయ ప్రత్యర్థి కోడెల శివప్రసాదరావు అని అంబటి రాంబాబు అన్నారు.

పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని అన్నారు. కాఫర్‌ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్‌ కట్టారని, దాంతో అది కొట్టుకుపోయిందని అన్నారు. చంద్రబాబు తప్పిదం వల్లే రూ.2 వేల కోట్ల నష్టం జరిగిందని అంబటి రాంబాబు ఆరోపించారు.

Published at: 27 Apr 2023 12:32 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.