Marri Rajasekhar: వైసీపీకి మరో షాక్‌, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్‌ రాజీనామా

Marri Rajasekhar News Today | వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Continues below advertisement

Marri Rajasekhar resigns from YSRCP | గుంటూరు: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎమ్మెల్సీ పదవికి వైసీపీకి మర్రి రాజశేఖర్‌ రాజీనామా చేశారు. వైసీపీ నుంచి సైతం మర్రి రాజశేఖర్  (Marri Rajasekhar)  వైదొలిగారు. ఈ రాజీనామాతో వైసీపీ అసంతృప్తుల సంఖ్య ఐదుకు చేరింది. ఇదివరకే వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. ఆ జాబితాలో తాజాగా మర్రి రాజశేఖర్ చేరారు. ఇంతకుముందు పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేయడం తెలిసిందే. 

Continues below advertisement
Sponsored Links by Taboola