Andhra News in Telugu: వైసీపీ(YCP)ని పాతాళానికి తొక్కుతామంటూ తాడేపల్లిగూడెం సభలో పవన్ కల్యాణ్(Pavan Kalyan) చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి కొడలినాని(Kodali Nani) కౌంటర్ ఇచ్చారు. జగన్ ను మీరు తొక్కడం కాదు.. జనమే చంద్రబాబు(CBN), పవన్ ను తిరిగి లేవకుండా తొక్కేస్తారని ఆయన విమర్శించారు. కాపు సామాజికవర్గం పవన్ ను నమ్మే పరిస్థితిలో లేదని మండిపడ్డారు. చంద్రబాబుకు కాపు సామాజికవర్గం తగిన బుద్ధి చెబుతారంటూ అన్నారు. ఆయన దవడ పళ్లు రాలిపోయేలా రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం వచ్చే ఎన్నికల్లో శాస్తి చేస్తారంటూ కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు.
కుటిల రాజకీయం
తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ సీఎం జగన్ (Jagan)ను తొక్కడం కాదు.. పవన్ కల్యాణ్‌ను నాశనం చేస్తున్న చంద్రబాబును 80 లక్షల పాదాలు తిరిగి లేవకుండా పాతాళానికి తొక్కుతాయన్నారు. కాపు(Kaapu) సామాజికవర్గం వారిద్దరికీ బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా చంద్రబాబు(CBN), పవన్(PK) కల్యాణ్ జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుు...చివరికి పవన్ ను, ఆయన సామాజికవర్గం ఓట్లను నమ్ముకుని ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితికి దిగజారరని కొడాలినాని విమర్శించారు. చంద్రబాబు(CBN) రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ..పవన్ ఒళ్లుమరిచిపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియనంతగా ఊగిపోతూ తాడేపల్లిగూడెం(Thadepalligudem) సభలో పవన్ హడావుడి చేశారన్నారు. పవన్ ను అడ్డుపెట్టుకున జగన్ ను నీచంగా తిట్టించిన చంద్రబాబు...మేము ప్రతీగా రెచ్చిపోయి పవన్ ను తిడితే దాన్ని అడ్డుపెట్టుకుని ఆ సామాజికవర్గం ఓట్లు తమవైపు తిప్పుకునేలా కుటిల రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేసిన మంచిని, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలను నమ్మిన సీఎం జగన్(Jagan) 175 స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతున్నారని కొడాలినాని తెలిపారు. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు..తాను చేసింది ఇదీ అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారన్నారు.
మూడు శాతం ఓట్లకే 30 సీట్లా...
తెలుగుదేశం(TDP) తొలిజాబితా చూస్తేనే ఆ పార్టీ ఇతర కులాలను ఎంతగా మోసం చేసిందో అర్థమవుతుందన్నారు. ఇప్పడు ప్రకటించిన జాబితాలో 21 మంది కమ్మ(Kamma) సామాజికవర్గం అభ్యర్థులు ఉన్నారు. ప్రకటించాల్సిన మిగిలిన సీట్లలో మరో 10మందికి అవకాశం కల్పిస్తారని కొడాలినాని అన్నారు. రాష్ట్రంలో 3శాతం ఓట్లు ఉన్నవారికే 30 సీట్లు ఇస్తే....తమకు 20 శాతం ఓటర్లు ఉన్నారని పదేపదే చెప్పుకునే పవన్ కల్యాణ్ కాపుల కోసం ఎన్ని సీట్లు అడగాలని నిలదీశారు. మొత్తం 24 సీట్లకు పవన్ ఒప్పందం కుదుర్చుకోవడంపై జనసేన కార్యకర్తలు సంతోషంగా లేరని...జనసైనికులే బహిరంగంగా చెబుతున్నారన్నారు.
తాను ఇష్టానుసారం మాట్లాడి ప్రత్యర్థులు దానికి స్పందిస్తే ఆ సింపతీతో చంద్రబాబును గెలిపించేందుకు పవన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కొడాలినాని మండిపడ్డారు. బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం...జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు ఏమేరకు సీట్లు కేటాయించిందని కొడాలినాని ప్రశ్నించారు. చంద్రబాబు చేసే కుల, కుటిల రాజకీయ ఎత్తుగడల్లో తాము చిక్కబోమని కొడాలినాని అన్నారు. పవన్ కల్యాణ, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. జగన్ చేసిన మంచిపనులు, సంక్షేమ పథకాలే ఈసారి వైసీపీని అధికారంలోకి తీసుకొస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా మరోసారి జగన్ సీఎం కావడం ఖాయమని కొడాలినాని స్పష్టం చేశారు.