Pawan Kalyan Varahi Yatra Poster:  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 14న వారాహి యాత్ర ప్రారంభించనున్నారు. ఈ మేరకు వారాహి యాత్ర పోస్టర్ ను పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. దాంతో పాటు వారాహి తొలి విడత యాత్రలో పర్యటించనున్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను పవన్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ నియమించింది. జనవాణి కార్యక్రమం సమన్వయకర్తగా డి వరప్రసాద్ వ్యవహరించనున్నారు.






వారాహి యాత్రలో నియోజకవర్గాల జనసేన సమన్వయకర్తలు..  
నర్సీపట్నం - బొలిశెట్టి సత్యనారాయణ, వంపూర్ గంగులయ్య
పాయకరావుపేట - గడసాల అప్పారావు, మూగి శ్రీనివాస్
యలమంచిలి - బండ్రెడ్డి రామక్రిష్ణ, బేతపూడి విజయశేఖర్
తుని - బోనబోయిన శ్రీనివాస యాదవ్, తాతంశెట్టి నాగేంద్ర
ప్రత్తిపాడు - చిలకం మధుసూదన్ రెడ్డి, అక్కల గాంధీ
పిఠాపురం - బొమ్మిడి నాయకర్, చిల్లపల్లి శ్రీనివాస్
కాకినాడ రూరల్ - నయుబ్ కమల్
కాకినాడ అర్బన్ - గాదె వెంకటేశ్వర రావు
ముమ్మిడివరం - బొలిశెట్టి సత్యనారాయణ
అమలాపురం - బోనబోయిన శ్రీనివాస యాదవ్, సుందరపు విజయ్ కుమార్
పి.గన్నవరం - గడసాల అప్పారావు
రాజోలు - చిలకం మధుసూదన్ రెడ్డి


పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు అండగా నిలిచిన జనసేన
వినుకొండ నియోజకవర్గం బ్రాహ్మణపల్లికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు గొల్ల గురుబ్రహ్మ ప్రమాదంలో మరణించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షల బీమా చెక్కు అందచేశారు నాదెండ్ల మనోహర్. ఉమ్మడి గుంటూరు జిల్లాకి చెందిన పలువురు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు వేర్వేరు ప్రమాదాల్లో గాయపడ్డారు. వారిని పార్టీ నేతలతో కలిసి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. వీరికి వైద్య ఖర్చులకి సంబంధించి బీమా చెక్కులను అందచేశారు. అంతకుముందు కాజీపేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు గద్దె వెంకట సత్యనారాయణ ఇటీవల ప్రమాదంలో గాయపడ్డారు. ఆయనను పరామర్శించి, వైద్య ఖర్చులకి సంబంధించి రూ.50 వేల భీమా చెక్కు అందించారు.


జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనం వారాహి. ఈ ప్రచార వాహనంతో ప్రజల్లోకి రావాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఈ మేరకు వారాహి రూట్ మ్యాప్ సిద్ధం చేసింది జనసేన. తూర్పు గోదావరి జిల్లాలో అన్నవరంలో సత్యదేవుని దర్శించుకున్న తరువాత జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈ నెల 14 నుంచి ప్రారంభం అవుతుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇటీవల తెలిపారు.






వారాహి రూట్ మ్యాప్ విడుదల చేసిన జనసేన 
ప్రత్తిపాడు నియోజకవర్గం, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు.. అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, నర్సాపురం, భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన నేతలు నేడు సమావేశమై చర్చించిన అనంతరం వారాహి రూట్ మ్యాప్ విడుదల చేశారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు, అధిక సమయం ప్రజల మధ్య గడిపేలా జనసేన నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.