Nara Lokesh : ఢిల్లీలో పర్యటిస్తున్న నారా లోకేష్‌ పలువురు కేంద్రమంత్రులతో సమావేశమవుతున్నారు. ఇవాళ(బుధవారం) కేంద్రమంత్రి హోంమంత్రి సహా పలువురుని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. పెండింగ్ ప్రాజెక్టుల అంశాలపై మాట్లాడినట్టు సోషల్ మీడియా వేదికగా మంత్రి ప్రకటించారు. గురువారం కూడా టూర్ కంటిన్యూ అవుతుందని పలువురు మంత్రులతో సమావేశం అవ్వబోతున్నారు. 

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమైన నారా లోకేష్‌... ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు గురించి కూడా వివరించారు. ఈనెల 21న విశాఖలో ప్రధాని మోదీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్లు ఆయనకు తెలియజేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అమలు అవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరించి కొత్తప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని నారా లోకేష్ కోరాను. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశాను. చంద్రబాబు సుదీర్ఘ పాలన అనుభవం ఏపీని అభివృద్ధి బాటలో నడిపిస్తుందని అమిత్‌షా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా భరోసా ఇచ్చారని సోషల్ మీడియాలో వెల్లడించారు. 

కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో లోకేష్ సమావేశం

కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో కూడా నారా లోకేష్ భేటీ అయ్యారు. రాయలసీమలో హైకోర్టు బెంచి ఏర్పాటు ఆవశ్యకత వివరించారు.  కర్నూలులో హైకోర్టు బెంచి అన్నది అక్కడి ప్రజల చిరకాల కోరికని సహకరించాలని రిక్వస్ట్ చేశారు. న్యాయపరమైన అవసరాల కోసం రాయలసీమ ప్రజలు ఎపి రాజధానికి రావడానికి 500 కిలోమీటర్లకుపైగా ప్రయాణించాల్సి ఉంటుంది పేర్కొన్నారు. 

యువగళం పాదయాత్ర సందర్భంగా సీమ ప్రజలు, న్యాయవాదులు హైకోర్టు బెంచి చేయాలని విన్నవించారని న్యాయశాఖ మంత్రికి తెలిపారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా త్వరితగతిన బెంచి ఏర్పాటుకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలోని కోర్టుల్లో జ్యుడిషియరీ ఇన్ ఫ్రాస్ట్చక్చర్ అభివృద్ధికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనకి కూడా యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని కేంద్రమంత్రికి అందజేశారు.

ఏపీ విద్యా విధానంపై కేంద్రం అధ్యయనం 

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రి నారా లోకేష్ కలిశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపడుతున్న సంస్కరణలు వివరించారు. ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP)  కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాప్రమాణాల మెరుగుదలకు 9600 మోడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేసి, వన్ క్లాస్ – వన్ టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రాతిపదికను ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలను విజయవంతంగా పూర్తిచేసినట్టు పేర్కొన్నారు. విద్యారంగ అభివృద్ధికి సలహాల కోసం ప్రతివారం టీచర్స్ యూనియన్లు, ఉత్తమ ఉపాధ్యాయులతో సమావేశమవుతున్నామని చెప్పారు. 

ఆగస్టులో ఏపీలో ఎడ్యుకేషన్ కాంక్లేవ్‌

జులై 5 న జరిగే మెగా పిటిఏం కార్యక్రమానికి హాజరుకావాలని ధర్మేంద్ర ప్రధాన్‌ని ఆహ్వానించారు.  ఆగస్టులో విద్యా శాఖ మంత్రుల కాంక్లేవ్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌కు అవకాశం ఇవ్వాలని లోకేష్ కోరారు. అందుకు కేంద్రమంత్రి అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలపై అభినందనలు తెలిపిన ధర్మేంద్ర ప్రధాన్... వాటిని అధ్యయనం చేయాల్సిందిగా కేంద్ర విద్యా శాఖ అధికారులకు సూచించారు.

సీమలో ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్స్

కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో మీట్ అయ్యారు నారా లోకేష్. పండ్లతోటల అభివృద్ధికి అన్నివిధాల అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని కోరారు. పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లభించక రాయలసీమ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా అక్కడి రైతులకు మెరుగైన రేట్లు లభించి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు సహకరించాలని విజ్ఞప్తి చేసినట్టు ప్రకటించారు. 

అన్నదాతలకు మేలు చేసేందుకు మోదీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషిచేస్తుందని, నూరుశాతం సహకారాన్ని అందిస్తానని పాశ్వాన్ చెప్పారన్నారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని కేంద్రమంత్రికి అందించారు.