Andhra Pradesh Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కామ్‌కేసులో మరో అడుగు పడబోతోంది. కీలకమైన ఛార్జిషీట్‌ను దాఖలు చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా విచారణకు పిలిచారు. ఆయన్ని అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే కేసులో నాటి మద్యం శాఖ మంత్రి నారాయణ స్వామికి తాజాగా నోటీసులు జారీ చేశారు. 

నిందితులు 49 మంది- 11 మంది అరెస్టు

జగన్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి నేతలు మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కామ్‌పై ప్రత్యేక సిట్ వేసి దర్యాప్తు చేపట్టారు. ఆ సిట్‌ చాలా మంది అధికారులు లిక్కర్ వ్యాపారులు, వైసీపీ నేతలు, వారికి సహకరించిన వారిని ప్రశ్నించింది. కొందర్ని అరెస్టు కూడా చేసింది. ఇందులో వైసీపీ సానుభూతిపరులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తంగా  ఈ కేసులో నిందితులుగా 49 మందిని చేరిస్తే 11 మందిని అరెస్టు చేసింది. ఈ లిస్టు మరింతగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. 

లిక్కర్‌స్కామ్‌లో నిందితుల జాబితాA1. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి(రాజ్ కసిరెడ్డి)A2. దొంతి రెడ్డి వాసుదేవ రెడ్డిA3. దొడ్డ వెంకట సత్య ప్రసాద్A4. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిA5. మాజీ ఎంపీ వి.విజయ సాయిరెడ్డిA6. సజ్జల శ్రీధర్ రెడ్డిA7. ముప్పిడి అవినాష్ రెడ్డిA8. బూనెటి చాణక్యA9. తుకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిA10. SK. సైఫ్ అహ్మద్A11. ఓల్విక్ మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబయి, మహారాష్ట్రA12. క్రిపాటి ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మహారాష్ట్రA13. నైస్నా మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబయి, మహారాష్ట్రA14. ట్రిఫర్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబయి, మహారాష్ట్రA15. WIXOW ఎంటర్‌ప్రైజెస్, ముంబయి, మహారాష్ట్రA16. డికార్ట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తిరుపతిA17. టెక్కర్ ఎక్స్‌పోర్ట్స్ & ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్A18. దీపక్ ఎంటర్‌ప్రైజెస్, ముంబయి, మహారాష్ట్రA19. విశాల్ ఎంటర్‌ప్రైజెస్, MJ మార్కెట్, మహారాష్ట్రA20. లావిష్ ఎంటర్‌ప్రైజెస్, దిల్లీA21. కీరాజ్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మహారాష్ట్రA22. అర్రోయో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూ ఢిల్లీA23. ఈజీలోడ్ నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీA24. బాలాజీ ట్రేడింగ్, బెంగళూరుA25. అదాన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్A26. లీలా డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, పాండిచ్చేరిA27. న్యూ మోంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, మహారాష్ట్రA28. రుచిత జ్యువెలర్స్, మహారాష్ట్రA29. మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, ముంబయి, మహారాష్ట్రA30పైలా దిలీప్.A31ధనుంజయ రెడ్డి,A32 కృష్ణ మోహన్ రెడ్డి A 33 బాలాజీ గోవిందప్ప.A4 వెంకటేష్ నాయుడు.A35 బాలాజీ కుమార్.A36 నవీన్ కుమార్.A37 హరీష్.A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A 39 చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.A 40  వరుణ్ పురుషోత్తం 

అరెస్టయిన వారు  11 మంది.

A1. కసిరెడ్డి రాజశేఖర్A6. సజ్జల శ్రీధర్ రెడ్డిA8. బూనెటి చాణక్యA30 పైలా దిలీప్.A31ధనుంజయ రెడ్డి,A32 కృష్ణ మోహన్ రెడ్డి A 33 బాలాజీ గోవిందప్ప.A4 వెంకటేష్ నాయుడు.A35 బాలాజీ కుమార్.A36 నవీన్ కుమార్.A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

నేడు కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు 

ఇన్నిరోజులు దర్యాప్తు చేసిన అంశాలపై నేటు కోర్టులో సిట్‌ ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనుంది. ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలు, అందుకు తగ్గ సాక్ష్యాలు, వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ రిపోర్టులు, బ్యాంకు స్టేట్మెంట్‌లు ఇలా వేల డాక్యుమెంట్‌ను కోర్టు ముందు ఉంచబోతున్నారు. ఏదైనా సాంకేతిక కారణాలతో నేడు వీలు కాకపోతే సోమవారం కచ్చితంగా ఛార్జ్‌షీట్ వేస్తారు. ఈ ఛార్జ్‌షీట్‌లో ఎవరెవరి కుట్ర ఉంది? అసలు కుట్ర ఎక్కడి నుంచి మొదలైంది లాంటి విషయాలు వివరించబోతున్నారు. అందుకే ఛార్జ్‌షీట్ ఎపిసోడ్‌ను తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.   

నేడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు!

ఇదే లిక్కర్ స్కామ్‌లో నాల్గో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నేడు సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటి వరకు కోర్టు విధించిన రక్షణలో ఉంటూ విచారణకు హాజరయ్యారు. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అరెస్టుపై కూడా ఆయనకు ఊరట లభించలేదు. అందుకే ఇవాళ విచారణ తర్వాత మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో కూడా జారీ చేసినట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైనప్పటి నుంచి మిథున్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన విదేశాలకు పారిపోకుండా ముందస్తుగా లుక్‌అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు అధికారులు. ఆయన కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. సిట్‌ విచారణకు మాత్రం మిథున్ రెడ్డి వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ కేసులోనే నాటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేసిన నారాయణస్వామికి సిట్ నోటీసులు పంపించింది. ఈ నెల 21న లిక్కర్‌ కేసులో విచారణకు రావాలని పిలుపునిచ్చింది.