ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి ఫలితంగా ఏపీ నుంచే నేరుగా హజ్ యాత్రకు వెళ్లే సౌకర్యం ఏర్పడిందని, తొలిసారి విజయవాడ నుంచి విమాన సదుపాయం కల్పించినట్లు రాజ్యసభ సభ్యుడు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన గురువారం పలు అంశాలను వెల్లడించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం హజ్ యాత్రికులకు ఆర్దిక సహాయం కల్పిస్తోందని అన్నారు. మక్కాలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెల్లిన యాత్రికులకు ఒకే ప్రాంగణంలో వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
లా నేస్తం న్యాయవాదులకు ఆసరా
కొత్తగా న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టిన యువతీ, యువకులకు లా నేస్తం సహకారంతో భవిష్యత్తుతో వారు న్యాయవాదులుగా స్థిరపడేందుకు దోహదపడుతోందని విజయసాయి రెడ్డి అన్నారు. ప్రభుత్వం తమకు తోడుగా నలిచినట్లుగానే, తాము కూడా పేదలకు సాయపడాలనే తలంపు వారి మదిలో మెదలాలన్నదే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమని అన్నారు.
మెడిసిన్ తయారీలో ఇండియా సంవృద్ధి సాధించాలి
కొన్ని రకాల మెడిసిన్ దిగుమతులు, ఇతర అనేక మెడిసిన్ ల తయారీలో ఉపయోగించే ముడిసరుకు కోసం భారతదేశం ఇతర దేశాలపై ఆధారపడుతోందని విజయసాయి రెడ్డి అన్నారు. మెడిసిన్ తయారీ రంగంలో బారతదేశం స్వయం సంద్ది సాధించేందుకు దేశీయ ఉత్పత్తులు పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని అన్నారు. స్వదేశీ ఫార్మసీ ఉత్పత్తులను,పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు స్కీంలు, ప్రోత్సాహకాలు అందించాలని కోరారు.
యూపీఐ పేమెంట్లలో సాంకేతిక ఇబ్బందులకు చెక్ పెట్టాలి
యూపీఐ పేమెంట్స్ విధానంలో భారతదేశం అనేక అగ్రరాజ్యాల కంటే ముందుందని, యూజర్ ఫ్రెండ్లీ కూడా అని విజయసాయిరెడ్డి అన్నారు. యూపీఐ పేమెంట్ విధానాన్ని ప్రభుత్వం పెద్జ ఎత్తున ప్రోత్సహిస్తున్న తరుణంలో సెర్వర్ ఫెయిల్, ట్రాన్జాక్షన్ ఫెయిల్ వంటి సమస్యలు వినియోగదారలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టాలని కోరుతున్నానని ఆయన అన్నారు.